దత్తత గ్రామంలో పర్యటించిన సచిన్ (ఫొటోలు)
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మంగళవారం తాను దత్తత తీసుకున్న గ్రామంలో పర్యటించారు. సన్సాద్ ఆదర్శ్ గ్రామ యోజన(ఎస్‌ఏజీవై) పథకం కింద మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని డోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ నిమిత్తం సచిన్ ఎంపీగా ఆ గ్రామాన్ని సందర్శించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

దత్తత గ్రామాల్లో సచిన్‌కు ఘన స్వాగతం
క్రికెట్ ఐకాన్, రాజ్యసభ సభ్యుడు అయిన సచిన్ టెండూల్కర్‌కు తన దత్తత గ్రామంలో ఘన స్వాగతం లభించింది. చిన్నారులు, పెద్దలు కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపించారు. అక్కడ పాఠశాల చిన్నారులతో కలిసి సచిన్ సరాదాగా క్రికెట్ ఆడారు.

అభివృద్ధి పనుల నిమిత్తం రూ.4కోట్లు
ఎంపీగా కొనసాగుతున్న సచిన్ గ్రామ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.4కోట్లను విడుదల చేశారు. గ్రామాన్ని పరిశీలించిన అనంతరం సచిన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందంటూ కొనియాడాడు. ఇన్ దియా ఫౌండేషన్ ఆ అభివృద్ధి పనులను నిర్వహించింది.

గ్రామం మెరుగైంది
ఆ నిధుల నుంచి ఓ వాటర్ ట్యాంకు నిర్మాణం చేసింది. ఇంటింటికి నీరు సరఫరా అయ్యేలా నీటి పైపులను ఏర్పాటు చేశారు. చక్కటి రవాణా కోసం కాంక్రీటు రోడ్లను వేశారు. ఓ పాఠశాలను సైతం అవే నిధుల నుంచి ఏర్పాటు చేశారు.

మున్ముందు చేయబోయే పనులు
ఇంకా ఆ ఫౌండేషన్ ద్వారా సోలార్ ఎనర్జీని ఏర్పాటు చేస్తామంటూ ప్రతి రోడ్‌కి వీధి దీపాలు, సకాలంలో కరెంటు సౌకర్యం ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామ జనాభా 2800కు పైగా ఉంది. కార్యక్రమంలో ఈయనతో పాటుగా ఒస్మానాబాద్ కలెక్టర్ ఆర్‌వి గేమ్ పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications