మంత్రిపై సచిన్ మండిపాటు, ఇలా మరోసారి చేయొద్దంటూ లేఖ

హైదరాబాద్: పలు సార్లు అభిమానులకు, ప్రజలందరికీ చెప్తూనే ఉన్నా. మళ్లీ కేంద్ర మంత్రికి సైతం తన బాధను విన్నవించారు సచిన్ టెండూల్కర్. ద్విచక్రవాహనాలపై ప్రయాణించేటప్పుడు సురక్షిత ప్రయాణం కోసం హెల్మెట్లు ధరించాలని కోరారు. ఈ విషయమై టీమిండియా దిగ్గజ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ కొన్నేళ్ల నుంచి వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

మంత్రి నితిన్ గడ్కరీకి
హెల్మెట్లు వాడమని చెప్తున్న టెండూల్కర్ తాజాగా వాటి నాణ్యతపై మండిపడ్డారు. తక్కువ నాణ్యతతో హెల్మెట్లు తయారుచేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఘాటుగా లేఖను పంపారు.

మైదానంలో ఆడటానికి
తన లేఖలో ఏమన్నారంటే.. తక్కువ గ్రేడ్ మెటీరియల్ ఉపయోగించి తయారు చేస్తున్న హెల్మెట్లను ఐఎస్‌ఐ మార్క్ వేసి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. క్రీడాకారులుగా మైదానంలో ఆడటానికి వెళ్తున్నప్పుడు ఒరిజినల్ హై-క్వాలిటీ భద్రతా పరికరాలను ఉపయోగించడంలో గల ప్రాముఖ్యాన్ని మేము అర్ధం చేసుకున్నాం.

మృతిచెందిన వారిలో
భారత్‌లో ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఉపయోగించే హెల్మెట్లలో కూడా అంతేస్థాయిలో అత్యంత నాణ్యత కలిగిన ప్రమాణాలను కొనసాగించాల్సిన అవసరముంది. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో 30శాతం మంది ద్విచక్రవాహనదారులేనని, 2016లో అన్ని రకాల ప్రమాదాల్లో మృతిచెందిన వారికన్నా ఇదే అత్యధికం.

సోషల్‌మీడియాలో హెల్మెట్
నకిలీ హెల్మెట్లతో ప్రమాదం పొంచి ఉందని.. సురక్షితమైన హెల్మెట్లను అందుబాటులో ఉంచడంతో ప్రమాదాల నుంచి బయటపడే వారి సంఖ్య 42శాతం మేర పెరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర తన కారు ఆగినప్పుడు బైక్‌పై వెళ్లేవారికి హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించడంతో పాటు సోషల్‌మీడియాలో హెల్మెట్ ప్రాముఖ్యంపై పలుమార్లు పోస్ట్‌లు కూడా చేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications