Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ అన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు: కుంబ్లే


Sachin Tendulkarన్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ అన్ని రికార్డులను బద్దలు కొడుతాడని భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. టెస్టు మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో రెండో స్థానానికి చేరుకున్న సచిన్ ను ఆయన అభినందించారు. దాహం ఎప్పుడూ ఉంటుందని, కెరీర్ ను తాము ఇరువురం ఒకేసారి ప్రారంభించామని, సచిన్ క్రికెటర్ గా, వ్యక్తిగా ఎదుగుతుండడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన అన్నారు.

సచిన్ ఒత్తిడిని తట్టుకునే తీరు తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని, బ్యాట్ ను పట్టుకుని మైదానంలోకి దిగిన ప్రతిసారి సచిన్ పై ఒత్తిడి ఉంటుందని, గత 18 ఏళ్లుగా సచిన్ దాన్ని ప్రతిభావంతంగా ఎదుర్కున్నాడని ఆయన అన్నారు. ఆట పరిస్థితులకు సచిన్ బాగా సర్దుకున్నాడని, మ్యాచ్ ను ముగించడానికి ప్రతిభావంతంగా ఆడాడని ఆయన అన్నారు. టెస్టు క్రికెట్ లో రికార్డులన్నీ సచిన్ బద్దలు కొడతాడని ఆయన అన్నారు. పరుగులు, సెంచరీలతో పాటు అన్ని విషయాల్లో సచిన్ నెంబర్ వన్ బ్యాట్స్ మన్ అవుతాడని ఆయన అన్నారు.
Story first published: Monday, November 26, 2007, 23:53 [IST]
Other articles published on Nov 26, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+