ముంబై: ఆస్టేలియా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రూపొందించిన 'పదకొండు మంది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో తన ఫోటో ఉండటం గొప్ప అదృష్టమని' క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్నారు. 'బ్రాడ్‌మన్ ఇంట్లో తన ఫోటో ఉండటం తనకు లభించిన అత్యుత్తమ గౌరవమని' సచిన్ తెలిపారు.
1994-95లో బ్రాడ్‌మన్, నా బ్యాటింగ్ శైలి అతని బ్యాటింగ్ శైలితో పోలి ఉందని తన భార్య చెప్పారు. నా జీవితంలో అదొక అధ్బుతమైన క్షణం. 'జీవితంలో తాను అందుకున్న అతి పెద్ద అభినందన సర్ డొనాల్డ్ బ్ర్డాడ్ మన్ ఇచ్చారని' సచిన్ అన్నారు. ఆస్టేలియా ప్రధాని టోని అబాట్ సమక్షంలో ఆదేశ కాన్సులేట్ చేసిన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో పొల్గోన్న సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2007 సిడ్నీలో మ్యాచ్‌లో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ బ్యాట్‌ని పట్టుకోని వచ్చానని సంఘటనను గుర్తుచేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ వయసు 41 సంవత్సరాలు. ప్రపంచంలో ఉన్న బౌలర్స్ అందరికీ సచిన్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పిన మ్యాచ్‌లు ఎన్నో. త్వరలో ఆస్టేలియా, న్యూజిలాండ్‌లో జరగనున్న ప్రపంచ కప్‌కు భారత్ సిద్దంగా ఉందన్నారు. ఢిపెండింగ్ ఛాంపియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకునే సత్తా టీమిండియాకు ఉందని అన్నారు. టీమిండియాలో యువకులు ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారని' అన్నారు.
'1991-92లో జరిగిన ఆస్టేలియా, న్యూజిలాండ్ ప్రపంచ కప్ టూర్ ఎన్నో అనుభూతులను మిగిల్చిందన్నారు. పరాజయం ఎదుర్కొవాల్సి వచ్చినప్పుడు, తిరిగి మళ్లీ సరైన దారిలో నా అడుగులు వేసేలా స్పోర్ట్ నేర్పించిందని' అన్నారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో టోనీ అబాట్‌తో పాటు మాజీ క్రికెటర్లు గిల్‌క్రిస్ట్, బ్రెట్‌లీ పాల్గొననున్నారు. క్రీడా రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలపై కూడా అబాట్ సంతకం చేశారు.