Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి తర్వాత పిచ్ బాగోలేదనడం సచిన్ స్థాయికి తగదు: వార్న్

Shane Warne
జైపూర్: ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్, ప్రస్తుత రాజస్దాన్ రాయల్స్ కెప్టెన్ షేన్‌వార్న్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌పై అసహానాన్ని ప్రదర్శించాడు. శుక్రవారం రాజస్దాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌కి మద్య జైపూర్‌లోని మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై వార్న్ సేన అలవోక విజయాన్ని నమోదు చేసింది.

సచిన్ టెండూల్కర్ రాజస్దాన్ రాయల్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమి తర్వాత పిచ్ బాగోలేదని సమర్దించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేవలం 94 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఇలా తమపై ఓటమి తర్వాత పిచ్ బాగోలేదనడం సచిన్ స్థాయికి తగదని వార్న్ అన్నాడు. స్టార్ ఆటగాళ్లున్న ముంబై ఓటమికి కారణాలు వెతుక్కుంటోందని రాజస్దాన్ రాయల్స్ కెప్టెన్ షేన్‌వార్న్ విమర్శించాడు ఈవిషయాన్ని వార్న్ పూణె వారియర్స్‌పై విజయం సాధించిన తర్వాత చెప్పడం విశేషం.

ఇక పిచ్ ఇన్పెక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. మరి మేము మాత్రం మూడు వికెట్లను కొల్పోయి టార్గెట్‌ని రీచ్ అవ్వడం జరిగింది. పిచ్ గనుక సరిగా లేకపోయినట్లైతే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఇదే పిచ్‌పై ఒక వికెట్ కోల్పోయి 160 పరుగులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాకు తెలిసి రాజస్దాన్ రాయల్స్ క్రికెట్ అసోషియేషన్, క్యూరేటర్ తోపాష్ చఠర్జీ వాళ్శు చేసినటువంటి జాబ్‌ని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఈ పిచ్‌ని బ్యాట్స్ మెన్స్‌కి బౌలర్స్‌కి అనుకూలంగా మరచినందుకు. కానీ సచిన్ టెండూల్కర్ మాత్రం మాపై ఓడిన తర్వాత పిచ్ బాగాలేదని అనడం సరిగా లేదని వినర్శించారు.

బిసిసిఐ ఛైర్మన్ పిచ్ కమిటీ వెంకట్ సుందరం సచిన్ చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించి రాజస్దాన్ క్రికెట్ అసోషియేషన్‌తో మాట్లాడడం జరిగింది. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ముంబై పిచ్ ఐతే గనుక బౌన్స్, ఫేస్‌కుకు అనుకూలంగా ఉంటుంది. కానీ రాజస్దాన్ పిచ్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్దం అని అన్నారు. షేన్‌వార్న్ మాత్రం తన టీమ్ విన్నింగ్ మూమెంట్ వైపు పయనించడం తనకి చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఇక్కడి సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు చేతితో 6 వికెట్ల తేడా తో పరాజయం పాలైంది. రాజస్థాన్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన పుణె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 143 పరుగులు చేసింది. జట్టు ఆటగాళ్లలో రాబిన్‌ ఉతప్ప (35), మనీష్‌ పాండే (30), మిథున్‌ మన్హస్‌ (24)లు రాణిం చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రాస్‌ టేలర్‌ (47 నాటౌట్‌) 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లను మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.

పుణె జట్టు బౌలర్లలో రాహుల్‌ శర్మ (3/13) మూడు వికెట్లను కూల్చాడు. ఐపీఎల్‌ టోర్నీలో ఈ ఏడాదే ఆరంగేట్రం చేసిన ఆ జట్టు రెండు వరుస విజయాలతో తన పయనాన్ని ప్రారంభిం చింది. అయితే ఆ ఊపును ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో కొనసాగించడంలో విఫలమైంది. అత్యధిక పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రాస్‌ టేలర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+