Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భజ్జీ, సైమో మధ్య రాజీ చేసిన సచిన్, ఒకే టీమ్‌లో హుషారుగా

Harbhajan Singh-Andrew Symonds
ముంబై: సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కి దేవుడు అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ని టాప్‌లో నిలబెట్టి తనదైన ముద్రని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోనే కాకుండా ఐపిఎల్‌లో కూడా వేశాడు. 2007-2008వ సంవత్సరంలో ఆస్ట్రేలియాకి, ఇండియాకి మద్య జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్‌లో సైమండ్స్, హార్బజన్ ఇద్దరూ ఒకరినోకరు దూషించుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్బంలో వచ్చినటువంటి 'మంకీ గేట్ స్కాండల్' ముగిసి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది.

ఇదే మంకీ గేట్ స్కాండల్ ఇటీవలే అక్టోబర్ 2010వ సంవత్సరంలో జరిగింది. సైమండ్స్ ఎప్పుడు హార్బజన్ కనిపించినా తనయొక్క మంకీ గేట్‌తో సరదాగా ఆటపట్టిస్తున్నాడు. ఐతే ఇలాంటి కొతి చెష్టలకు చెక్‌పెట్టి ఇద్దరూ ఇప్పుడు ఒకే టీమ్‌లో ముంబై ఇండియన్స్ తరుపున జట్టు విజయాల కోసం శ్రమిస్తున్నారు. దీనికి అంతటికి కారణం సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్‌గా తన భాద్యతలను సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా సైమండ్స్, హార్బజన్ మద్య సయోద్య కుదర్చడంలో తనదైన పాత్రని పోషించాడని సమాచారం.

గత వారం సైమండ్స్‌ని హార్బజన్ గురించి నాలుగు మాటలు చెప్పమని అడగగా ప్రస్తుతానికి ఇక్కడ నేను ఎటువంటి ఇంటర్యూలు ఇవ్వడం లేదు, స్వారీ నాకు చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సైమండ్స్ మేనేజర్ మ్యాట్ ఫీరాన్ వెల్లడించడం జరిగింది. గతంలో జరిగినటువంటి పాత విషయాలను ఇద్దరూ పూర్తిగా మరచిపోవడం జరిగింది. ఐపిఎల్ ఆఫ్షన్ జనవరిలో జరిగింది. ఆ సందర్బంలో నేను సైమండ్స్‌తో నిన్ను ముంబై ప్రాంచైజీ కొనుగోలు చేయడం జరిగింది. నువ్వు భజ్జీతో కలసి ఆడబోతున్నావు అని తెలియజేశాను అని అన్నారు. ఆ సందర్బంలో సైమండ్స్ ఇది నిజమేనా అంటూ తన ఆశ్ఛర్యాన్ని వ్యక్తం చేశారు.

ఆ సమయంలో సైమూ నోటి వెంట మాటలు రాలేదు. నిజంగా ముంబై ఇండియన్స్‌తో కలసి ఆడడానికి తను స్వాగతించాడు. నిజం చెప్పాలంటే వారిద్దరూ కాంపిటేటివ్ ఏనిమల్స్ అని అన్నారు. సాధారణంగా ఇద్దరూ వేరు వేరు టీమ్స్‌లలో ఉంటే అందరికి చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకే టీమ్‌లో ఉన్నారు అదే తేడా అని అన్నారు. అసలు వీరిద్దరూ ఇంత బద్ద శత్రువులుగా తయారు కావడానికి కారణం 2008వ సంవత్సరంలో జరిగినటువంటి టెస్ట్ సిరీస్‌లో సైమండ్స్ చేసినటువంటి వెకిలి చేష్టలకు సైమండ్స్‌ని హార్బజన్ సింగ్ కోతి అన్న విషయం అందరికి తెలిసిందే.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+