Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పదేళ్ల ఐపీఎల్‌లో ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్: పంత్‌కు సచిన్ కితాబు

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫిరోజ్ షా కోట్లా వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

209 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 97 పరుగులు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది.

ఆ క్షణంలో అతడు సెంచరీ మిస్ అయినందకు ఎంతగానో బాధపడి ఉంటాడు. అయితే ఆ తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిన ప్రశంసలు చూసి ఉప్పొంగిపోయి ఉంటాడు. 43 బంతుల్లోనే 97 పరుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్‌ను ఐపీఎల్‌లో తాను చూసిన అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లో ఒకటని సచిన్ ట్వీట్ చేశాడు.

Tendulkar dubs Pant's knock as one of the best in IPL history

కేవలం ఈ ఒక్క సీజన్‌లోనే కాదని, ఇప్పటి వరకు జరిగిన 10 సీజన్లలో కూడా ఇదే మంచి ఇన్నింగ్స్ అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. దీనికి తోడు అవుటైన తర్వాత రిషబ్ పంత్ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా టీవీ స్క్రీన్‌ను ఫొటో తీసి ఆ ఫొటో కూడా ట్విట్టర్లో ట్వీట్‌కు జత చేశాడు.

పంత్ అద్భుత ఇన్నింగ్స్‌పై క్రికెట్ విశ్లేషకులు సైతం అతడిపై ప్రశంసలు కురిపించారు. అయితే తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిడు. 43 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. బాసిల్ తంపి బౌలింగ్‌లో కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ సమయంలో గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా కూడా స్వయంగా పంత్ వద్దకు నడుచుకుంటూ వచ్చి, సెంచరీ మిస్సయినందుకు ఓదార్చాడు. చక్కటి ఇన్నింగ్స్ ఆడావంటూ అభినందించాడు. ఇక ఢిల్లీ జట్టు మెంటార్ రాహుల్ ద్రవిడ్ సహా ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మరీ తిరిగొస్తున్న పంత్‌కు స్వాగతం పలికారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+