Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ పాఠాలు: మిడిల్‌సెక్స్ క్రికెట్‌తో కలిసి సచిన్ టెండూల్కర్ అకాడమీ

Sachin Tendulkar Launches Cricket Academy
Tendulkar Associates With Middlesex Cricket To Launch Academy For Kids

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భవిష్యత్ తరం ఆటగాళ్లను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సచిన్ తన స్నేహితులతో కలిసి కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా క్రికెట్ పాఠాలు చెప్పేందుకు ఇంగ్లీస్ కౌంటీ జట్టు మిడిల్‌సెక్స్‌తో సచిన్ టెండూల్కర్ ఒప్పందం చేసుకున్నాడు. మిడిల్‌సెక్స్ క్రికెట్‌తో కలిసి టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ(టీఎంజీఏ)ని ప్రారంభించబోతున్నట్లు సచిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో సచిన్ ట్వీట్ చేశాడు.

ఈ అకాడమీలో 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు గల బాలబాలికలకు మిడిల్‌సెక్స్, సచిన్ స్వయంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, మిడిల్‌సెక్స్ క్రికెట్ సంయుక్తంగా కలిసి టీఎంజీఏను ఏర్పాటు చేస్తున్నాయి.

ఆగస్టు 6-9 మధ్య లండన్‌లో గల నార్త్‌వుడ్‌లోని మర్చంట్ టేలర్స్ స్కూల్‌లో ఫస్ట్ క్రికెట్ క్యాంపును నిర్వహించనున్నారు. ఆ తర్వాత ముంబై, లండన్‌లోని పలు ప్రాంతాల్లో అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ అకాడమీ ద్వారా నిరుపేద పిల్లలకు 100 శాతం స్కాలర్ షిప్‌ను కూడా అందివనున్నారు.

కొత్త వెంచర్‌ను ప్రారంభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సచిన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే మిడిల్‌సెక్స్ క్లబ్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు ఆండ్రూ స్ట్రాస్, మైక్ గాటింగ్, డెనిస్ కాంప్టన్, జాన్ ఎమ్‌బురే, మైక్ రేర్లీ పలువురు అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటారు.

Story first published: Wednesday, July 18, 2018, 17:26 [IST]
Other articles published on Jul 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+