Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పొట్టోడే కానీ గట్టోడు.. గాల్లోకి ఎగిరి సిక్సర్ కొట్టిన బవుమా (Video)

డర్బన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్నతొలి టెస్టులో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి 281 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 40 ఓవర్లకు మూడు వికెట్లకు 132 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో సఫారీ సేన 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా (70; 117 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార చెరో మూడు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆలౌటైంది. కామిందు మెండిస్ (13; 20 బంతుల్లో, 3 ఫోర్లు), లాహిరు కుమార (10 నాటౌట్; 5 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మార్కో జేన్సన్ ఏడు వికెట్లతో విజృంభించాడు. కొయెట్జీ రెండు, రబాడ ఒక్క వికెట్ తీశారు. కాగా, 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. బవుమా (24 బ్యాటింగ్; 45 బంతుల్లో, 1 ఫోర్), ట్రిస్టన్ స్టబ్స్ (17 నాటౌట్; 51 బంతుల్లో, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు.

Temba Bavuma s Spectacular Uppercut Six Stuns Sri Lanka in Thrilling Display

అయితే కెప్టెన్ టెంబా బవుమా కళ్లుచెదిరే షాట్‌తో సిక్సర్ బాదాడు. గాల్లోకి ఎగిరి అప్పర్ కట్ షాట్‌తో బంతిని సిక్సర్‌గా మలిచాడు. లాహిరు కుమార్ వేసిన బంతిని లెంగ్ స్టంప్‌కు వైపుగా జరిగి, రెండు కాళ్లను గాల్లోకి లేపి థర్డ్ మ్యాన్ దిశగా స్టాండ్స్‌కు తరలించాడు. వచ్చిన ఎక్స్‌ట్రా బౌన్స్‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బవుమా పొట్టోడే కానీ గట్టోడు అంటూ నెటిజన్ల ప్రశంసిస్తున్నారు. బవుమా 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉంటాడు.

కాగా, శ్రీలంక 83 బంతుల్లో 42 పరుగులకే ఆలౌటైన క్రమంలో పలు రికార్డులు నమోదయ్యాయి. గత 100 ఏళ్లలో ఒక జట్టు ఇంత తక్కువ బంతుల్లో ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి. 1924లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 75 బంతుల్లోనే ఆలౌటైంది. ఇక టెస్టుల్లో శ్రీలంక ఇదే అత్యల్ప స్కోరు. అంతకుముందు 1994లో కాండీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 71 పరుగులు అత్యల్పంగా ఉండేవి.

Story first published: Friday, November 29, 2024, 9:19 [IST]
Other articles published on Nov 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+