Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్య‌ల్ప స్కోరులో ఆసీస్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కోహ్లీసేన‌!

ICC Cricket World Cup 2019 : Tema India Registered Lowest Total For Loss Of 3 Wickets || Oneindia
Tema India registered lowest total for the loss of three wickets in a Cricket World Cup semi-final match

మాంచెస్ట‌ర్‌: భార‌త క్రికెట్ జ‌ట్టు దెబ్బ‌కు ఆస్ట్రేలియాకు చెందిన ఓ రికార్డు తెర‌మరుగైపోయింది. కొత్త రికార్డును నెల‌కొల్పింది టీమిండియా. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా- మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఈ అవాంఛిత రికార్డును నెల‌కొల్పింది కోహ్లీసేన‌. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ సెమీఫైన‌ల్‌లో అయిదు ప‌రుగుల‌కే మూడు వికెట్ల‌ను కోల్పోవ‌డమే ఈ రికార్డు. ఇంత‌కుముందు ఇది ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది.

గుజ‌రాత్‌లోని మొహాలీ స్టేడియంలో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఎనిమిది ప‌రుగుల‌కు మూడు వికెట్ల‌ను కోల్పోయింది. ఇప్ప‌టిదాకా అదే అత్య‌ల్ప స్కోరు. 1996 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో మొహాలీ స్టేడియంలో వెస్టిండీస్‌ను ఢీ కొట్టిన ఆస్ట్రేలియా ఎనిమిది ప‌రుగుల‌కు మూడు వికెట్ల‌ను కోల్పోయింది.

ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ జ‌ట్టు విజ‌యం సాధించింది. తాజాగా భార‌త జ‌ట్టు దీన్ని అధిగ‌మించింది. న్యూజిలాండ్‌పై తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో అయిదు ప‌రుగుల‌కే మూడు వికెట్ల‌ను కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఇక ఇంత‌కంటే త‌క్కువ స్కోరుకు ఏ జ‌ట్టు కూడా అవుట్ కాద‌నే అనుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో- కొన్నేళ్ల పాటు టీమిండియా నెల‌కొల్పిన ఈ చెత్త రికార్డుకు ఎలాంటి ఢోకా ఉండ‌క‌పోవ‌చ్చు.

Story first published: Wednesday, July 10, 2019, 17:23 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+