Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలుగు టైటాన్స్ జోరు: రానా, అభిషేక్ సందడి(పిక్చర్స్)

విశాఖపట్నం: సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి(11 పాయింట్లు), రోహిత్‌ బలియాన్‌(11) మెరుపు రైడింగ్‌కు.. ధర్మరాజ్‌ (5) కట్టుదిట్టమైన డిఫెన్స్‌ తోడవడంతో ఆ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం విశాఖలో జరిగిన మ్యాచులో టైటాన్స్‌ 45-34తో దబాంగ్‌ ఢిల్లీని చిత్తు చేసింది.

కాగా, ప్రోబడ్డీ కబడ్డీలో ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ప్రముఖ సినీ నటుడు రానా, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌లు ఈ మ్యాచులో సందడి చేశారు. ఇది ఇలా ఉండగా, మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌ 29-28తో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై విజయం సాధించింది.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి(11 పాయింట్లు), రోహిత్‌ బలియాన్‌(11) మెరుపు రైడింగ్‌కు.. ధర్మరాజ్‌ (5) కట్టుదిట్టమైన డిఫెన్స్‌ తోడవడంతో ఆ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండో విజయం సాధించింది.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

సోమవారం విశాఖలో జరిగిన మ్యాచులో టైటాన్స్‌ 45-34తో దబాంగ్‌ ఢిల్లీని చిత్తు చేసింది.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఢిల్లీ రైడర్లు కాశీలింగ్‌ (12), సుర్జీత్‌సింగ్‌ (10) చెలరేగినా ప్రయోజనం లేకపోయింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్‌ ఆధిపత్యం కొనసాగించింది.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

టైటాన్స్‌ రైడర్ల జోరుకు ఢిల్లీ డిఫెండర్లు ఏ సమయంలోనూ అడ్డుకట్ట వేయలేకపోయారు. రాహుల్‌, రోహిత్‌ మెరుపు దాడులతో టైటాన్స్‌ స్కోరును వేగంగా పెంచుతుంటే.. ఇటు డిఫెండర్లు ఢిల్లీ రైడర్లకు చుక్కలు చూపించారు.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

కాశీలింగ్‌ ప్రథమార్థంలో సాధించింది కేవలం నాలుగు రైడ్‌ పాయింట్లు. ఇక సుర్జీత్‌ 17వ నిమిషానికి గానీ ఖాతా తెరవలేదు.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

అంతకుముందు అతడు చేసిన మూడు రైడ్లలోనూ టైటాన్స్‌ డిఫెండర్లకు దొరికిపోయాడు. 8వ నిమిషంలో, 20వ నిమిషంలో ఢిల్లీని ఆలౌట్‌ చేసిన టైటాన్స్‌.. ప్రథమార్థాన్ని 26-10తో ముగించింది.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఆ తర్వాత 23వ నిమిషంలో కాశీలింగ్‌ సూపర్‌ రైడ్‌ సాధించడం.. మరోవైపు సుర్జీత్‌ కూడా జోరందుకోవడంతో ఢిల్లీ కాస్త పుంజుకుంది.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

మధ్యలో ధర్మరాజ్‌ సూపర్‌ టాకిల్‌తో దిల్లీ వేగాన్ని కొద్దిగా అడ్డుకున్నాడు. అనంతరం కాశీలింగ్‌, సుర్జీత్‌ విజృంభించి 32వ నిమిషంలో టైటాన్స్‌ను ఆలౌట్‌ చేశారు.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

అయినా.. టైటాన్స్‌ ఆధిక్యానికి ఏ ఢోకా రాలేదు. ఆ దశలోనూ 36-27తో ఆధిక్యంలోనే ఉన్న తెలుగు జట్టు.. అలాగే జోరు కొనసాగిస్తూ మ్యాచ్‌ సొంతం చేసుకుంది. టైటాన్స్‌ డిఫెండర్లు వికాస్‌ (3), మనోజ్‌ (2) కూడా ఆకట్టుకున్నారు.

అభిషేక్-రానా

అభిషేక్-రానా

కాగా, ప్రోబడ్డీ కబడ్డీలో ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ప్రముఖ సినీ నటుడు రానా, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌లు ఈ మ్యాచులో సందడి చేశారు.

రానా సందడి

రానా సందడి

మ్యాచ్ సందర్భంగా అభిమానులను ఉత్సాహపరుస్తున్న నటుడు రానా.

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

మ్యాచ్ సందర్భంగా అభిమానులను ఉత్సాహపరుస్తున్న బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఇది ఇలా ఉండగా, మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌ 29-28తో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై విజయం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+