ఆరెంజ్ క్యాప్ రేసులో మన తెలుగు కుర్రాడు.. ముంబై ఇండియన్స్‌కు దొరికిన ఆణిముత్యం

నిన్న ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 36పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రాహుల్ 62బంతుల్లో 103పరుగులతో చెలరేగాడు. ఈ సీజన్‌లో ముంబైపైనే తన రెండో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఐపీఎల్ 2022ఆరెంజ్ క్యాప్ రేసులో నంబర్ 2స్థానానికి చేరుకున్నాడు. అంతకుముందు రెండో స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా (295)ను అతను అధిగమించాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో రాహుల్ 73పరుగుల సగటుతో 368పరుగులు చేశాడు.
ఇక ఆరెంజ్ క్యాప్ కంటెండర్స్‌లో నంబర్ 1 పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 491పరుగులతో కొనసాగుతున్నాడు. అయితే ఈ ఆరెంజ్ క్యాప్ రేసులో అనూహ్యంగా ముంబై యువ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టాప్-5లో చేరాడు. అతను నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 27బంతుల్లో 38పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో అతని మొత్తం స్కోరు 272కి చేరుకుంది. ఫలితంగా ఆరెంజ్ క్యాప్ రేసులో నంబర్ 8వ స్థానంలో ఉన్న తిలక్.. నంబర్ 4కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై జట్టులో అత్యధిక పరుగులు చేసింది కూడా తిలక్ వర్మే కావడం విశేషం.

ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్నాడు
ప్రతి మ్యాచ్‌లో ముంబై ప్లేయర్ తిలక్ వర్మ రాణిస్తూనే ఉన్నాడు. ఓ వైపు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ లాంటి మేటి ఆటగాళ్లు చతికిల పడుతుంటే.. తిలక్ వర్మ మాత్రం ముంబై పోరాటంలో తన పటిమను చూపిస్తూనే ఉన్నాడు. ఢిల్లీతో జరిగిన తన తొలి అరంగేట్ర మ్యాచ్‌లో ఈ 19ఏళ్ల కుర్రాడు 15బంతుల్లో 22పరుగులతో ఐపీఎల్ కెరీర్‌ను ఆరంభించాడు.

ఒక్క ఇన్నింగ్స్‌తో హెడ్‌లైన్స్‌లో తిలక్ పేరు
ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తిలక్ వర్మ గురించి క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఆ మ్యాచ్‌లో 33బంతుల్లో 61పరుగులతో విరుచుకపడిన తిలక్.. కాసేపు ఉంటే మ్యాచ్ గెలిపించేవాడే. ఆ ఇన్నింగ్స్‌తో ఈ యువ సంచలనం వార్తల్లో హెడ్ లైన్స్‌గా మారిపోయాడు. తర్వాత మ్యాచుల్లోనూ 38, (0రనౌట్), 36, 26, 51, 38పరుగులతో కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

ముంబైకి వరంలా వర్మ
మొత్తం ఎనిమిది మ్యాచుల్లో 272పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో నంబర్ 4వ స్థానానికి చేరుకున్నాడు. వయసు చిన్నదైనా పరిణతి ఉన్న ఆటగాడిగా అతను కనబరుస్తున్న ప్రదర్శన గమనించదగ్గది. బౌండరీలు బాదడంలోనూ తిలక్ మంచి దిట్ట. మొత్తం 19ఫోర్లు, 13సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా తిలక్‌లో నచ్చేదేంటంటే.. పోరాటం.
ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు బౌలర్లు తమ పదునైన తెలివైన బంతులతో బురిడి కొట్టించాలని చూస్తున్నా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ పోరాడుతుంటాడు.
అవతలి ఎండ్‌లో ఉండే క్రికెటర్‌తో మంచి సమన్వయం చేసుకుంటాడు. మూడు సార్లు రనౌట్ అయినా.. ఏమాత్రం తన నిరాశపడకుండా అవతల ఉన్న క్రికెటర్ కావాలని చేసింది కాదు కదా అనే క్రీడా స్ఫూర్తితో మౌనంగా క్రీజు వీడి పెవిలియన్‌కు వెళ్లిపోతాడు. అతను ముంబై ఇండియన్స్‌కు దొరికిన ఆణిముత్యమనే చెప్పాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications