Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ కెప్టెన్‌గా అంబటి రాయుడు

TELANGANA T-20 LEAGUE: captain Ambati rayudu

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓపెన్ సెలక్షన్ ప్రోగ్రామ్ పాల్గొన్న క్రీడాకారులలో కొందరిని టీ20లీగ్‌కు ఎంపిక చేసింది. 30 డిసెంబరు 2017న ఉదయం 8 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది.

కెప్టెన్‌గా అంబటి:
సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సౌత్‌జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అంబటి రాయుడు, వైస్‌ కెప్టెన్‌గా పి. అక్షత్‌ రెడ్డి ఎంపికయ్యారు. ఈ జట్టుకు డి. కిషన్‌ రావు మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. విశాఖపట్నంలో జనవరి 8 నుంచి 14 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.

జట్టు వివరాలు: అంబటి రాయుడు (కెప్టెన్‌), పి. అక్షత్‌ రెడ్డి (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, బి. సందీప్, ఎ. ఆశిష్‌రెడ్డి, మొహమ్మద్‌ సిరాజ్, ఎం.రవికిరణ్, మెహదీహసన్, ఆకాశ్‌ భండారి, టి. రవితేజ, సుమంత్‌ కొల్లా (వికెట్‌ కీపర్‌), పి. రోహిత్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), పి. సాకేత్‌ సాయిరాం, ప్రజ్ఞాన్‌ ఓజా, తనయ్‌ త్యాగరాజన్, కార్తికేయ, డి. కిషన్‌రావు (మేనేజర్‌), జె.అరుణ్‌ కుమార్‌ (కోచ్‌), ప్రతాప్‌ సింగ్‌ (ఫిజియో), నవీన్‌ రెడ్డి (ట్రైనర్‌).

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 2, 2018, 13:27 [IST]
Other articles published on Jan 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+