For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో ఆడాలంటే అఫ్ఘనిస్థాన్‌ను దాటాల్సిందే: బీసీసీఐ

Teams touring India will play practice games against Afghanistan: BCCI

హైదరాబాద్: భారత్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ మొదలు టెస్టుల్లోకి అరంగ్రేటం చేస్తున్న అఫ్ఘనిస్తాన్‌కు భారత్ క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. దీంతో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయనున్న అఫ్గానిస్థాన్‌ జట్టుకు బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లే. అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ అభివృద్ధికి కొంతకాలంగా కృషిచేస్తున్న బీసీసీఐ.. ఆ జట్టుకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.

భారత పర్యటనకొచ్చే విదేశీ జట్లకు అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టుతో ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) చైర్మన్ అతీఫ్ మాషల్ ఆహ్వానం మేరకు కాబూల్‌లో పర్యటిస్తున్న బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీ గురువారం ఈ ప్రకటన చేశారు. మషాల్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌ సంబంధాలపై చర్చించాడు.

అఫ్గాన్‌ ఆటగాళ్లలో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు, వారికి అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడిన అనుభవాన్ని కల్పించేందుకు ఈ వార్మప్‌ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని చౌదరి చెప్పాడు. టెస్టు హోదా సంపాదించిన అఫ్గానిస్థాన్‌.. భారత్‌లో తన తొలి మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న బెంగళూరులో ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది.

రషీద్‌ ఖాన్‌ వంటి సంచలన ఆటగాళ్లను పరిచయం చేస్తూ... అఫ్గాన్‌ జూన్‌ 14న భారత్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేయనుంది. అంతకుముందు డెహ్రాడూన్‌లో బంగ్లాదేశ్‌తో మూడు టి20ల సిరీస్‌ ఆడుతుంది.

Story first published: Friday, June 1, 2018, 16:15 [IST]
Other articles published on Jun 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+