న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్‌కు ఇప్పటి నుంచే క్రికెటర్ల కసరత్తులు

Teams prepare to slug it out for place in ICC Womens World T20 2018

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో మహిళల వేగం పెరిగింది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమవడంతో.. అంతర్జాతీయంగా అన్ని జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మహిళల 6వ ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌కు వెస్టిండీస్ ఆతిధ్యమివ్వనుంది. నవంబర్ 9 నుంచి 24 వరకూ జరుగనున్న ప్రపంచకప్‌‌కు సన్నాహకంగా ఐసీసీ క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలు నిర్వహిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా వంటి టాప్ టీమ్స్ నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.

ఈ 8 జట్లతో పాటు మరో 2 జట్లకు ఐసీసీ.. ఫైనల్ టోర్నీలో ఆడే అవకాశం కల్పించింది. బంగ్లాదేశ్, స్కాట్లాండ్, యూఏఈ, థాయ్‌లాండ్, ఉగాండా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పాప్వా న్యూ గినియా జట్ల మధ్య క్వాలిఫైయింగ్ టోర్నీలు నిర్వహిస్తోంది.ఈ క్వాలిఫైయింగ్ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 2 జట్లు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.

క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలకు ఆతిధ్యమిస్తోన్న నెదర్లాండ్స్‌ జట్టుతో పాటు బంగ్లాదేశ్‌ను హాట్ ఫేవరెట్లు‌గా అంచనా వేస్తున్నారు.మహిళల క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడానికి, ఐసీసీ నిర్వహిస్తోన్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో క్వాలిఫైయర్స్‌లో పోటీ పడుతోన్న జట్ల సభ్యులతో రూపొందించిన వీడియోస్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోన్న..పాప్వా న్యూ గినియా,థాయ్‌లాండ్,ఉగాండా, యూఏఈ జట్లు ఏ స్థాయిలో రాణిస్తాయో అని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టీ20ల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మహిళా క్రికెట్‌ దేశాల జట్ల సంఖ్య.. మెన్స్ క్రికెట్‌ దేశాల సంఖ్య కంటే ఎక్కువ.

Story first published: Tuesday, July 17, 2018, 16:46 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X