For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ప్లేఆఫ్ చేరుకోవడానికి ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలున్నాయంటే?

playoff chancess for teams in ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో ఇప్పటికే 57మ్యాచ్‌లు అయిపోయాయి. ఒక్కో జట్టు కనీసం 11గేమ్‌లు ఆడింది. ఇక ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టుగా ముంబై అప్రదిష్ట మూటగట్టుకుంది. ఇక ముంబైని పక్కన పెడితే మరో తొమ్మిది జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లోకి నిలవడానికి పోటీపడుతున్నాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ రెండు మాత్రమే దాదాపు ప్లేఆఫ్‌కు అతి చేరువ కాగా.. మిగతా ఏడు జట్లు ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి ట్రై చేస్తున్నాయి. ఇక ఏ జట్టుకు ప్లేఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే..

 లక్నో సూపర్ జెయింట్స్ : 11 మ్యాచ్‌లలో 16పాయింట్లు

లక్నో సూపర్ జెయింట్స్ : 11 మ్యాచ్‌లలో 16పాయింట్లు

ఇక లక్నో మిగతా మూడు మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్ (మే 10), రాజస్థాన్ రాయల్స్ (మే 15), కోల్‌కతా నైట్ రైడర్స్ (మే 18) జట్లతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న లక్నో ఒక్క విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్‌కు అధికారికంగా చేరుకుంటుంది. ఇక రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే టాప్ 2 పోజిషన్లోకి లక్నో చేరుకుంటుంది.

 గుజరాత్ టైటాన్స్ : 11 మ్యాచ్‌లలో 16పాయింట్లు

గుజరాత్ టైటాన్స్ : 11 మ్యాచ్‌లలో 16పాయింట్లు

గుజరాత్ టైటాన్స్ తన తర్వాతి మ్యాచ్‌లలో లక్నో (మే 10), సీఎస్కే (మే 15), ఆర్సీబీ (మే 19)జట్లతో తలపడనుంది. ప్లేఆఫ్ చేరుకునేందుకు కేవలం ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు అనే తరుణంలో వరుసగా రెండు మ్యాచ్‌లలో గుజరాత్ ఓడిపోయింది. తద్వారా ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా తగ్గింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ ఖాయం కాగా.. రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్ 2 పోజిషన్లోకి చేరడానికి ఓ హోప్ ఉంటుంది. మూడు గెలిస్తే టాప్ 2పొజిషన్లోకి వెళ్తుంది.

 రాజస్థాన్ రాయల్స్ : 11 మ్యాచ్‌లలో 14పాయింట్లు

రాజస్థాన్ రాయల్స్ : 11 మ్యాచ్‌లలో 14పాయింట్లు

రాజస్థాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ (మే 11), లక్నో (మే 15), సీఎస్కే (మే 20) జట్లతో తలపడనుంది. రాజస్థాన్‌కు ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఆ జట్టుకు నెట్ రన్ రేట్ +0.326 మెరుగ్గా ఉంది. లక్నో +0.703 తర్వాత బెస్ట్ నెట్ రన్ రేట్ ఉన్న జట్టు రాజస్థానే. ప్లేఆఫ్ చేరుకోవాలంటే ఆ జట్టు రెండు మ్యాచ్‌లు గెలవాలి. ఒక్క మ్యాచ్ భారీ తేడాతో గెలిచి, రెండు మ్యాచ్ ల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినా ఆ జట్టు నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్ చేరుకోవచ్చు. రెండు, మూడు మ్యాచ్‌లు గెలిస్తే.. గుజరాత్, లక్నో జట్ల జయాపజయాల ఆధారంగా టాప్ 2 పొజిషన్లోకి కూడా రాజస్థాన్ చేరుకునే అవకాశముంది. ఇక ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోతే ఆ జట్టు ప్లేఆఫ్ చేరుకోవడం ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్, సీఎస్కే జట్ల విజయాలపై ఆధారపడి ఉంటుంది.

 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 12 మ్యాచ్‌లలో 14పాయింట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 12 మ్యాచ్‌లలో 14పాయింట్లు

ఆర్సీబీ జట్టు తన తర్వాతి మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్(మే 13), గుజరాత్ టైటాన్స్ (మే 19)తో తలపడనుంది. ఇక ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే తప్పకుండా ప్లేఆఫ్ చేరొచ్చు. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓడి మరో మ్యాచ్ గెలిస్తే మాత్రం ప్లేఆఫ్ రేసులో ఉన్న మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్సీబీ నెట్ రన్ రేట్ నెగెటివ్‌గా ఉంది. టాప్ 2 పొజిషన్లోకి వెళ్లాంటే లక్నో, గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ఓటములపై ఆధారపడి ఉంటుంది.

 ఢిల్లీ క్యాపిటల్స్ : 11 మ్యాచ్‌లలో 10పాయింట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ : 11 మ్యాచ్‌లలో 10పాయింట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్‌లలో రాజస్థాన్ (మే 11), పంజాబ్ కింగ్స్ (మే 16), ముంబై ఇండియన్స్ (మే 21) జట్లతో తలపడనుంది. 5వ స్థానంలో ఉన్న ఈ జట్టుకు ఉన్న పాజిటివ్ విషయం.. పాజిటివ్ నెట్ రన్ రేట్. ఈ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిస్తే.. దాదాపు ప్లేఆఫ్ చేరుతుంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్ ఛాన్సెస్ మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటాయి. టాప్ 2 పొజిషన్లోకి వెళ్లే అవకాశం దాదాపుగా ఈ జట్టుకు లేదు.

 సన్ రైజర్స్ హైదరాబాద్ : 11 మ్యాచ్‌లలో 10పాయింట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ : 11 మ్యాచ్‌లలో 10పాయింట్లు

సన్ రైజర్స్ తన తర్వాతి మ్యాచ్‌లలో కేకేఆర్ (మే 14), ముంబై (మే 17), పంజాబ్ కింగ్స్ (మే 22) జట్లతో తలపడనుంది. ఈ జట్టు నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉండడం వల్ల ప్లేఆఫ్ రేసుకు చేరుకోవాలంటే ఒక మ్యాచ్‌లోనైనా భారీ తేడాతో గెలిచి.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో స్వల్ప తేడాతో గెలవాల్సిన అవసరముంది. అయినప్పటికీ ఆర్సీబీ, ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్ గెలుపోటములు ఈ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయొచ్చు.

 కోల్‌కతా నైట్ రైడర్స్ : 12 మ్యాచ్‌లలో 10 పాయింట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్ : 12 మ్యాచ్‌లలో 10 పాయింట్లు

కోత్ కతా నైట్ రైడర్స్ తన తర్వాతి మ్యాచ్‌లలో సన్ రైజర్స్ (మే 14), లక్నో (మే 18) జట్లతో తలపడనుంది. దాదాపుగా ఈ జట్టు ప్లేఆఫ్ చేరడం కష్టమే. ఇప్పటికే 14పాయింట్లు 2,16పాయింట్లతో 2 టీంలు కొనసాగుతున్నాయి. ఈ టీం ప్లేఆఫ్ చేరాలంటే.. 14పాయింట్లతో కొనసాగుతున్న ఆర్సీబీ గానీ ఆర్ఆర్ గానీ ఇక ఒక్క మ్యాచ్ కూడా గెలవకూడదు. అలాగే ఢిల్లీ, సన్ రైజర్స్ జట్లు కూడా ఈ జట్టుకు అనుగుణంగా ఓటములు చవిచూడాలి. పైగా రెండు మ్యాచ్‌లలో నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయ్యేలా భారీ విజయాలను కోల్ కతా సాధించాలి.

ఇకపోతే చివరి మూడు స్థానాల్లో ఉన్న పంజాబ్ కింగ్స్ (10) , సీఎస్కే (8), ముంబై (4) పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఈ జట్లు ప్లేఆఫ్ చేరడం అసాధ్యమనే చెప్పాలి. పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ -0.231తో చాలా పేలవంగా ఉంది. మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు టాప్ 4లోకి చేరే అవకాశం ఉండొచ్చు. అది కూడా నెట్ రన్ రేట్ బాగా ఇంప్రూవ్ చేసుకునేలా ఆడాలి. పైగా మిగతా ఏడు జట్ల జయాపజయాలు ఆ జట్టుకు అనుగుణంగా ఉండాలి. ఇక చెన్నై మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచినా పెద్ద ఫాయిదా ఉండకపోవచ్చు. ముంబైని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అయితే చెన్నై, ముంబై ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసే డిసిషన్ మేకర్స్ అయ్యే వీలుంది.

Story first published: Tuesday, May 10, 2022, 18:25 [IST]
Other articles published on May 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+