Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడం, గెలవకపోవడం పూర్తిగా అతనిపై డిపెండ్ అయి ఉంది..!

Teamindia Winning Chances of T20 World cup Completely Depend on Surya Kumar Yadav says Saba Karim

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాను ఓడించిన ఇండియా స్వదేశంలో తొలిసారిగా టీ20సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. డేవిడ్ మిల్లర్ సెంచరీతో రాణించినప్పటికీ.. ఇండియా స్కోరు బోర్డుపై 238పరుగుల భారీ టార్గెట్ ఉంచడంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్ పవర్ ప్యాక్డ్ స్టార్.. సూర్యకుమార్ యాదవ్ అరివీర భీకర రీతిలో చెలరేగి ఆడాడు. అతను ప్రస్తుతం భారత బ్యాటర్లలో అత్యంత ఫామ్‌లో ఉన్న ప్లేయర్. ఇకపోతే భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్.. సూర్యకుమార్ ఫామ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు

ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు

టీ20 ప్రపంచకప్‌ భారత్ గెలవాలంటే.. కేవలం సూర్య ఫామ్ మీద ఆధారపడి ఉంటుందని అతను అంచనా కట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో సూర్య ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాను ఆపే జట్టే లేదని చెప్పాడు. అలాగే టీ20 ప్రపంచ‌కప్‌ ముందు భారత్ డెత్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ భారత బౌలింగ్‌ నాసిరకపు ఇంపాక్ట్ మ్యాచ్ మీద పడట్లేదని చెప్పాడు. ప్రస్తుతం టీ20ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యంత ఇన్ ఫార్మ్ బ్యాటర్ సూర్య అని.. కొనియాడాడు. ఈ సంవత్సరంలో సూర్యకుమార్ చాలా మంచి మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

అందువల్లే నేను ఈ మాట చెబుతున్నా

అందువల్లే నేను ఈ మాట చెబుతున్నా

సబా కరీమ్ 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్'లో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్ అసాధారణమైన సామర్థ్యాన్ని హైలైట్ చేశాడు. 'నేను ఒక విషయం చెప్పగలను. భారత్ ప్రపంచ‌కప్‌ గెలుచుకునే అవకాశాలు పూర్తిగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. అతను చాలా క్లిష్ట సమయంలో ఆడి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అందువల్లే నేను ఈ మాట చెప్తున్నాను. మిడిల్ ఓవర్లలో టీ20 ఫార్మాట్‌లో ఇంత ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడడం ఆషామాషీ కాదు.కానీ సూర్యకుమార్ యాదవ్‌కు ఉన్న అసాధారణ నైపుణ్యం, అనుభవం కారణంగా అతను చాలా సులభంగా షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నాడు. అతని నైపుణ్యానికి బౌలర్లకు ఎలా బంతులు వేయాలో కూడా తోచడం లేదు.' అని సబా కరీమ్ తెలిపాడు. .

గ్యాప్‌లు చూసి మరీ బాదుతాడు

గ్యాప్‌లు చూసి మరీ బాదుతాడు

'అతను ఫీల్డ్‌లో గ్యాప్‌లను కనుగొనడంలో దిట్ట. కొన్నిసార్లు అతని డ్యాన్సింగ్ షాట్లకు.. బౌలర్ల ప్లేస్‌మెంట్స్ పూర్తిగా విఫలమయవుతాయి. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ బాగా రాణించగలడని నేను ఆశిస్తున్నాను. పైగా ఆ దేవుణ్ని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రపంచ‌కప్‌లో కూడా సూర్య ఇదే ఫామ్‌తో రాణించాలని కోరుకుంటున్నా.' అని సబా కరీమ్ అన్నారు. భారత బ్యాటింగ్ స్టార్ స్కై ఒక క్యాలెండర్ ఈయర్లో టీ20Iలలో భారత్ తరఫున అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో రెండో టీ20లో తన ఇన్నింగ్స్ ద్వారా.. టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్‌గా కూడా సూర్య నిలిచాడు.

Story first published: Tuesday, October 4, 2022, 16:54 [IST]
Other articles published on Oct 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+