For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra రాహుల్‌ను టీమిండియా కాస్త మిస్సవుతుంది.. దక్షిణాఫ్రికాకు మిస్సింగ్ ప్రాబ్లం లేదు ఎందుకంటే?

TeamIndia seems to be missing KL Rahul in the opening a bit says Aakash Chopra

కటక్‌లో టీమిండియా రెండో టీ20లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు భారత జట్టు కేఎల్ రాహుల్‌ ఓపెనింగ్‌ను కోల్పోతున్న ఫీలింగ్ వస్తుందని భారత మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో ప్రత్యర్థి జట్టుకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని పేర్కొన్నాడు.

చోప్రా మాట్లాడుతూ.. క్వింటన్ డికాక్, ఐడెన్ మార్క్‌రామ్ వంటి దక్షిణాఫ్రికా స్టార్లు ఆ జట్టులో లేకపోయినా.. ఆ టీం గెలుస్తుంది కాబట్టి వాళ్లు లేని లోటు పెద్దగా కన్పించదు. మరియు వాళ్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదని తెలిపాడు. ఇక దక్షిణాఫ్రికా మొదటి రెండు టీ20లలో గెలిచి సిరీస్‌ గెలవడానికి ఒక్క విజయం దూరంలో మాత్రమే ఉంది.

రోహిత్, కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా ఈ సిరీస్‌లో బరిలోకి దిగింది. ఇక తొలుత ఐదు టీ20ల ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. కానీ సిరీస్ ప్రారంభానికి ముందు గజ్జలో గాయం కారణంగా రాహుల్‌ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌కు సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రాహుల్ మిస్సవ్వడం కాస్త ఇండియా టీంను ప్రభావితం చేస్తుందని తన యూట్యూబ్ ఛానెల్‌లో చోప్రా పేర్కొన్నాడు.

'భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో రాహుల్, రోహిత్, విరాట్ వంటి పేర్లు లేకపోవడం వల్ల దక్షిణాఫ్రికా కాస్త కాన్ఫిడెంట్‌గా ఉండి విజయాలు సాధిస్తుంది. ఆ జట్టు గెలుస్తుంది కాబట్టి ఆ జట్టులో ఎవరూ లేని లోటు కన్పించడం లేదు. మార్క్రామ్, డి‌కాక్‌ లాంటి స్టార్లను దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో కోల్పోయిందని ఎవరూ అనరు. కానీ జట్టు ఓడిపోయినప్పుడు మాత్రం వాళ్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తుందనే భావన వస్తుంది' అని చోప్రా పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5టీ20 మ్యాచ్‌ల సిరీస్లో 0-2తేడాతో టీమిండియా వెనకబడి ఉంది. ఇక నేడు మన విశాఖపట్టణంలో మూడో టీ20 జరగనుంది. సిరీస్ చేజార్చుకోకుడదంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పకుండా గెలిచి తీరాలి. విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.00గంటలకు ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, June 14, 2022, 16:19 [IST]
Other articles published on Jun 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+