అందమైన అమ్మాయిలతో టీమిండియా ప్లేయర్లకు అదిరిపోయే వెల్‌కం.. తిరువనంతపురంలో స్పెషల్ ట్రీట్

సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో 6వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసుకుని దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం సోమవారం తిరువనంతపురానికి చేరుకుంది. సెప్టెంబర్ 28 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2న గౌహతిలో, అక్టోబర్ 4న ఇండోర్లో మిగతా రెండు టీ20లు జరగనున్నాయి. ఇక సిరీస్ ప్రారంభం కానున్న తిరువనంతపురంలో టీమిండియాకు అదిరిపోయే వెల్ కం దక్కింది.
పూలు చల్లుతూ..
టీమిండియా బస చేసే హోటల్‌కు బస్ చేరుకోగా.. బస్ దిగిన ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు కేరళ క్రికెట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్ దిగి హోటల్‌కు వచ్చే మార్గంలో ప్లేయర్లపై అందమైన అమ్మాయిలతో పూలు చల్లించారు. అలాగే ప్లేయర్ల మెడలో మెడల్స్ కూడా అమ్మాయిలతో వేయించారు. సంప్రదాయ చీరకట్టుతో తళుకులీనుతున్న నవ్వుల మధ్య భారత ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ హోటల్లోకి వెళ్లారు. అలాగే ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా ధరించే స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించిన కళాకారులతో కూడా ప్లేయర్లకు వెల్ కమ్ చెప్పించారు. ఇక హోటల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా కేరళ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసింది.
సంజూ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన
ఇకపోతే టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని కేరళ ప్లేయర్ సంజూ శాంసన్‌కు మద్దతుగా అతని అభిమానులు బస్ వద్దకు వచ్చి రచ్చ చేశారు. సంజూకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసను తెలియజేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి భారత ఆటగాళ్లు బయటకు రాగానే సంజూ.. సంజూ అని బిగ్గరగా నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. సంజూ శాంసన్‌కు అభిమానులు భారీగా ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌లోనూ ఈ నిరసన కొనసాగే అవకాశం ఉంది. అయితే తమ నిరసనను నినాదాల వరకే పరిమితం చేయడంతో భారత ఆటగాళ్లూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక రోహిత్, సూర్యకుమార్ యాదవ్ సంజూ శాంసన్ ఫోటోలను చూపిస్తూ ఫ్యాన్స్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇకపోతే కేరళ ఫ్యాన్స్ భారత ప్లేయర్లకు మాత్రం బ్రహ్మారథం పట్టారు. ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
సౌతాఫ్రికా టీ20 జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, అన్రిచ్ నార్జ్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, రివైస్ రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, బ్జోర్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications