భారత జట్టు పేస్ విభాగం సెట్
మొహాలీ విమానాశ్రయంలో దిగిన ఆటగాళ్లలో ఇటీవల గాయపడి జట్టుకు దూరమైన పలువురు మళ్లీ కన్పించడం ఆసక్తికరంగా అనిపించింది. శనివారం ఉదయం హర్షల్ పటేల్ కన్పించగా.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన సతీమణి సంజనా గణేషన్‌తో కలిసి దిగాడు. ఆసియా కప్ టోర్నీకి ముందు వీరిద్దరు గాయపడడంతో వీరు జట్టుకు సెలెక్ట్ కాలేదు. ఈసారి వీరు జట్టులోకి రావడంతో భారత పేస్ విభాగం మరింత బలంగా మారనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం టీ20 స్పెషలిస్టు బౌలర్ల రాకతో జట్టుకు ఇబ్బంది తప్పుతుందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఆసీస్ కూడా జట్టు కూర్పుపై ప్లాన్లు
ఈసారి ఆసీస్ జట్టు సైతం చాలా బలంగా కన్పిస్తోంది. ఐపీఎల్లో ముంబై స్టార్ మరియు బిగ్ హిట్టర్ అయిన టిమ్ డేవిడ్ ఆసీస్ జట్టుతో చేరాడు. ఇకపోతే ఆసీస్ జట్టు తమ బ్యాటింగ్ ఆర్డర్‌ను సెట్ చేసుకోవడానికి కూడా ఈ సిరీస్లో ప్రయత్నాలు చేయబోతుంది. ఇటీవల వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆరోన్ ఫించ్ టీ20లపై ఫోకస్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్‌గా అతను ఎలాంటి ఎత్తుగడలు వేయనున్నాడో కూడా చూడొచ్చు. పేస్ విభాగంలో స్టార్క్, బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్ గాయాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్టు స్క్వాడ్లు
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్(షమీ రిప్లేస్ మెంట్) , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఆస్టన్ ఆగర్, కెమరున్ గ్రీన్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్, మాథ్యు వేడ్, ప్యాట్ కమ్మిన్, జోష్ హాజిల్ వుడ్, కేన్ రిచర్డ్ సన్, నాథన్ ఎల్లిస్, అడమ్ జంపా


Click it and Unblock the Notifications












