Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆగస్టు 16న టీమిండియా హెడ్ కోచ్‌ ప్రకటన!!?

Teamindia next head coach to be announced on August 16?

ఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక ఫలితాలను బీసీసీఐ ఆగస్టు 16న (శుక్రవారం) ప్రకటించనుందని సమాచారం తెలుస్తోంది. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఈ శుక్రవారం హెడ్ కోచ్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహించనునుంది. ఇంటర్వ్యూలు పూర్తయిన రెండు మూడు రోజుల్లోపే కోచ్‌ను ప్రకటించే అవకాశం ఉంది మొదటగా తెలిసినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం శుక్రవారమే ఫలితాలు కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

16న హెడ్ కోచ్‌ ప్రకటన;

16న హెడ్ కోచ్‌ ప్రకటన;

హెడ్ కోచ్‌ పదవి కోసం ఎన్నో సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. అర్హులైన ఆరుగురితో కూడిన తుది జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు రేసులో ఉన్నారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సీఏవో కమిటీ వీరిని ఇంటర్వ్యూలు చేయనుంది. అదే రోజున ఫలితాలు కూడా ప్రకటించనున్నారు.

రవిశాస్త్రికి స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ:

రవిశాస్త్రికి స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ:

సీఏవో కమిటీ సభ్యులు జాబితాలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు సంబందించిన సమాచారంను ఇప్పటికే అందించారు. అయితే అభ్యర్థులు అందరూ నేరుగా ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశం లేదు. ముంబైకి రాలేని వాళ్లు స్కైప్‌ ద్వారా మాట్లాడి ప్రెజెంటేషన్‌ ఇస్తారు. ప్రస్తుతం టీమిండియాతో పాటు వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి అక్కడి నుంచే స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొంటాడు. ఆరుగురు అభ్యర్థులలో ఇంటర్వ్యూకు చిట్ట చివరగా హాజరయ్యేది రవిశాస్త్రే అని సమాచారం.

కోహ్లీ మద్దతు:

కోహ్లీ మద్దతు:

రవిశాస్త్రే కోచ్‌గా కొనసాగాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు సీఏవో కమిటీ సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ కూడా బహిరంగంగానే రవిశాస్త్రికి మద్దతు పలకడంతో.. ప్రస్తుత కోచ్‌నే మళ్లీ ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కపిల్ దేవ్ కూడా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం అని పేర్కొన్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌.. భారత్ అగ్రస్థానంపై కివీస్‌ కన్ను

రేసు రసవత్తరం:

రేసు రసవత్తరం:

అయితే కోచ్‌ ఎంపికలో కోహ్లీ అభిప్రాయాల్ని సీఏవో కమిటీ పరిగణనలోకి తీసుకోదని, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోచ్ రేసు రసవత్తరంగా మారనుంది. మాజీ కోచ్‌లు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురవనుంది. సీఏవో కమిటీ ప్రధాన కోచ్‌ పదవికి మాత్రమే ఇంటర్వ్యూలు చేపట్టనుందట. సహాయ కోచ్‌లు, ఇతర సిబ్బంది సంబందించిన ఇంటర్వ్యూ లను భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే ఈ ఇంటర్వ్యూ తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

Story first published: Wednesday, August 14, 2019, 14:06 [IST]
Other articles published on Aug 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+