For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోంది.. ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు!!

India vs bangladesh 2019 : Sourav Ganguly Says 'There Is No Need Two Captains For Team India'
Teamindia Is Winning Hence No Need For Dual Captaincy Says BCCI President Sourav Ganguly

ముంబై: సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అన్ని ఫార్మాట్లలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోంది. కోహ్లీ భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం జట్టుకు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు అని మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ స్పష్టం చేశారు. ప్రపంచకప్‌-2019లో భారత్ సెమీస్‌ నుండే నిష్క్రమించడంతో జట్టులో పలు వివాదాలు చుట్టుముట్టాయి. విండీస్ పర్యటన మొదలయ్యే వరకు రూమర్లు ఆగని విషయం తెలిసిందే.

కోహ్లీ, రోహిత్‌ల మధ్య గొడవలు:

కోహ్లీ, రోహిత్‌ల మధ్య గొడవలు:

ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌ నుండే నిష్క్రమించడంతో జట్టులో పలు వివాదాలు చుట్టుముట్టాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీని టెస్టులకే పరిమితం చేయాలని.. వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించాలని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కోహ్లీ, రోహిత్‌ల మధ్య గొడవలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే కోచ్ రవిశాస్త్రి, కోహ్లీ వివరణ ఇచ్చారు. దీంతో ఆ వార్తలకు పులిస్టాప్ పడింది. తాజాగా దాదా ఈ విషయంపై స్పందించారు.

 ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు:

ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు:

బుధవారం బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌర‌వ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడారు. 'టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అన్ని ఫార్మాట్లలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోంది. కోహ్లీ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం జట్టుకు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు' అని గంగూలీ అన్నారు.

అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్‌:

అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్‌:

'ప్రపంచకప్‌ తర్వాత భారత్ అనేక విజయాలు నమోదు చేసింది. ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. కోహ్లీసేన స్వదేశంలో వరుసగా 11 టెస్టు సరీస్‌లు గెలిచి.. ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. విదేశాల్లో కూడా విజయాల శాతం చాలా మెరుగుపడింది. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా సైతం కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. జట్టులో కోహ్లీ ముఖ్యమైన ఆటగాడు. అతడి నిర్ణయాలను గౌరవిస్తాం. అండగా ఉంటాం. అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగుతాడు' అని గంగూలీ స్పష్టం చేశారు.

 కోహ్లీకి మద్దతు ఇస్తాం:

కోహ్లీకి మద్దతు ఇస్తాం:

'ప్రపంచకప్ గెలవలేదు. అది నిజమే. కానీ.. ఏ జట్టు కూడా ప్రతిసారీ ప్రపంచకప్ గెలవదు. మేము కోహ్లీకి మద్దతు ఇస్తాం. భారత క్రికెట్ సజావుగా సాగేలా చూస్తా. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే ఇక్కడ ఉన్నాం. క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది. బీసీసీఐ నిర్వ‌హ‌ణ‌లో ఎటువంటి లోపం ఉండదు. బోర్డులో ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌కుండా చర్యలు తీసుకుంటాం. అంద‌రికీ బోర్డు ఒకేలా ఉంటుంది' అని గంగూలీ చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, October 24, 2019, 13:54 [IST]
Other articles published on Oct 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+