Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS AUS: తొలి సెమీఫైనల్‌లో విజయం ఆ జట్టుదే - బెట్టింగ్ అంచనాలివే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బిగ్గెస్ట్ క్లాష్ కు సమరం సిద్ధమైంది. అగ్రజట్లైన ఆస్ట్రేలియా - టీమిండియా తొలి సెమీఫైనల్ లో తలపడనున్నాయి. ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారా అని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు గెలిచే అవకాశాలున్నాయో అంచనాలు వేస్తూ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీకారం తీర్చుకునేందుకు..
ఐసీసీ టోర్నీలలో టీమిండియా విజయాలకు ఆస్ట్రేలియా ప్రతీసారి అడ్డుకట్ట వేస్తూ వస్తోన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ తొలి సెమీఫైనల్ పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌తో పాటు అదే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోనూ భారత్ జట్టును ఓడించింది ఆసీస్. దీంతో ఎలాగైనా ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టే ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. వరుస విజయాలతో ఫామ్ లో ఉంది.

Teamindia favourites against Australia in champions trophy 2025 first semifinal prediction

మ్యాచ్ ప్రిడిక్షన్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దుబాయ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి హ్యాట్రిక్‌ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. ఇప్పుడు సెమీస్‌ పోరులోనూ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. స్పిన్ పిచ్ లు భారత జట్టుకు బాగా కలిసొస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆసీస్ ఇప్పటివరకు దుబాయ్ పిచ్ పై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ భారత జట్టుకే ఫేవర్ గా ఉన్నాయి. అందుకే టీమిండియానే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు. కివీస్‌పై మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆసీస్ పై కూడా అదే ఫార్ములాతో ఆడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

టీమిండియా తుది జట్టు అంచనా
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వారాషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

Story first published: Tuesday, March 4, 2025, 9:03 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+