Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గావస్కర్ పై బీసీసీఐకి రోహిత్ శర్మ కంప్లైంట్.. ఎందుకంటే?

దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిర్యాదు చేశాడని తెలిసింది. గావస్కర్ తీరు నచ్చక.. ఆయనపై బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించగా.. ఆ సమావేశంలోనే రోహిత్ శర్మ.. సునీల్ గావస్కర్ గురించి లేవనెత్తినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

రీసెంట్ గా జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో పాటు ఇతర సిరీస్ ల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. దీంతో అతడి కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సునీల్ గావస్కర్ కూడా రోహిత్ ఆటతీరుపై విమర్శలు చేశారట. అయితే ఈ విమర్శలకు రోహిత్ నొచ్చుకున్నాడని తెలిసింది. అందుకే హిట్ మ్యాన్ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం.

Teamindia Captain Rohit Sharma Complained to BCCI on Sunil Gavaskar Critics

ఆస్ట్రేలియా పర్యటనలో తన ప్రదర్శన గురించి సునీల్ గావస్కర్ చేసిన కామెంట్స్ హద్దులకు మించి ప్రతికూల కామెంట్స్ చేశారని రోహిత్ సమావేశంలో చెప్పాడట. ఇతర క్రికెటర్లపై కూడా గావస్కర్ ఇలానే టూ మచ్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని, అలా చేయడం కరెక్ట్ కాదని అన్నాడట. "సునీల్ గావస్కర్ ఆటగాళ్లను మరీ ఇంత దారుణంగా విమర్శించడం సరికాదని రోహిత్ చెప్పాడు. గావస్కర్ చేసే విమర్శల వల్ల ఆటగాళ్ల మూడ్, మైండ్ సెట్ మారిపోతుంది. వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి విమర్శలను తీవ్రంగా పరిగణించాలి" అని రోహిత్ శర్మ బీసీసీఐకి చెప్పాడని ఓ క్రికెట్ ప్రతినిధి చెప్పారు.

సునీల్ గవాస్కర్ కామెంట్స్ ఏమన్నారంటే?
సునీల్ గావస్కర్ గతంలో విరాట్ కోహ్లీ, పంత్, బుమ్రాపై కూడా కామెంట్స్ చేశారు. రిషబ్ పంత్ అగ్రెసివ్ బ్యాటింగ్ స్టుపిడ్, ఫూల్ అంటూ విమర్శించారు. రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఓడిపోతున్న నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. రోహిత్ శర్మకు పాప ఉంది. కాబట్టి అతడు భార్యతో విశ్రాంతి తీసుకోవడం మంచిది అని సెటైర్లు వేశారు. ఓసారి కోహ్లీపై కూడా విమర్శలు చేస్తే, ఆ సమయంలో అనుష్క శర్మ కౌంటర్ కూడా ఇచ్చారు.

Story first published: Tuesday, January 28, 2025, 12:18 [IST]
Other articles published on Jan 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+