Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమ్ స్పిరిట్ కొరవడింది: గంగూలీ దీనిపై దృష్టి సారించు: సచిన్

Sachin Tendulkar Suggests Sourav Ganguly To Concentare On Duleep Trophy
Team spirit missing in Duleep Trophy, hope Ganguly revamps it, says Tendulkar

హైదరాబాద్: టీమ్ స్ఫిరిట్ కొరవడిన దులీప్‌ ట్రోఫీని పూర్తిగా సంస్కరించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. దులీప్‌ ట్రోఫీలో జట్టుగా కాకుండా ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా సచిన్ విమర్శించాడు.

రంజీ ట్రోఫీ సెమీస్‌ చేరిన నాలుగు జట్లు, అండర్‌-19, అండర్‌-23 ఆటగాళ్లతో మరో రెండు జట్లను రూపొందించి నాలుగు రోజుల పాటు జరిగే ఈ దులిఫ్ ట్రోఫీలో ఆడిస్తే బాగుంటుందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. సచిన్ మాట్లాడుతూ "దులీప్ ట్రోఫీపై గంగూలీ దృష్టి సారించాలని కోరుకుంటున్నా" అని అన్నాడు.

"దులీప్ ట్రోఫీలో ఎక్కువ మంది ఆటగాళ్లు జట్టు కోసం కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విన్నాను. ఆ తర్వాత టోర్నీలో వారు తదనుగుణంగా ఆడుతున్నారు. ఉదాహరణకు ఐపీఎల్‌ వేలాన్ని తీసుకుంటే లేదా టీ20, వన్డే. ఆటగాళ్లు వాటినే దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టు ఆడుతున్నారు" అని సచిన్ పేర్కొన్నాడు.

"క్రికెట్ ఎప్పుడూ టీమ్ గేమ్‌గా ఉన్నందున ఇది నేను చూడాలనుకునే ఒక మార్పు. ఇదంతా టీమ్ స్పిరిట్, ఆటగాళ్లంతా జట్టుగా కలిసి ఆడటం. కాబట్టి, రంజీల్లో సెమీస్‌ చేరిన నాలుగు జట్లకు తోడుగా మరో రెండు జట్లను ఎంపిక చేయాలి. ఎందుకంటే అర్హత సాధించని జట్లలోనూ ప్రతిభావంతులు ఉంటారు" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

"బాగా ఆడుతున్న అండర్‌-19, అండర్‌-23 ఆటగాళ్లనూ తీసుకోవాలి. అప్పుడు అందరూ అత్యుత్తమ ఆటగాళ్లే ఉంటారు" అని సచిన్ పేర్కొన్నాడు. దులీప్‌ ట్రోఫీలో ప్రస్తుతం ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్‌, ఇండియా రెడ్‌ జట్లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో తలపడుతున్నాయి.

Story first published: Tuesday, November 26, 2019, 19:16 [IST]
Other articles published on Nov 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+