INDvsBAN: పంత్ గాయం సంగతి దాచి.. సంజూకు ఛాన్స్ ఇవ్వని టీమిండియా!.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం టీమిండియాలో మంచి ఫామ్‌లో ఉన్న వికెట్ కీపింగ్ బ్యాటర్ ఎవరు? అంటే టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు సంజూ శాంసన్. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్నాడు. కానీ టీమిండియా మాత్రం అతనికే ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. దీంతో అభిమానులు బీసీసీఐని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికర విషయం వెలుగు చూసింది. పంత్‌కు అన్ని అవకాశాలు ఇస్తోంది బీసీసీఐ కాదట.. టీం మేనేజ్‌మెంటేనట!

కివీస్ టూర్‌లోనే..
న్యూజిల్యాండ్‌తో సిరీస్‌లో రిషభ్ పంత్ ఎంత చెత్తగా ఆడాడో తెలిసిందే. ఇలా ఆడుతున్నా కూడా అతన్నే కొనసాగిస్తూ.. జట్టులో ఉన్న సంజూకు మాత్రం టీమిండియా ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా తెలిసిన సమచారం ప్రకారం, కివీస్ పర్యటన నుంచి పంత్ వెన్నునొప్పితో బాధ పడుతున్నాడట. ఈ విషయాన్ని బీసీసీకి చెప్పాల్సిన టీం మేనేజ్‌మెంట్ మాత్రం గమ్మున కూర్చుంది. బీసీసీఐకి విషయం చెప్పకుండా, సంజూను ఆడించకుండా పంత్‌కు అవకాశాల మీద అవకాశాలు ఇచ్చింది.

బంగ్లా టూర్‌లో విషయం తెలిసి..
బంగ్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ సంగతి బీసీసీఐ పెద్దలకు తెలిసిందట. దాంతో వాళ్లు వెంటనే పంత్‌ను వెనక్కు పంపించాలని ఆదేశించారు. ఈ సమయంలో కూడా సంజూను కనీసం రిప్లేస్‌మెంట్‌గా అడగని టీం మేనేజ్‌మెంట్.. రాహుల్‌తో కీపింగ్ చేయిస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం టీం మేనేజ్‌మెంట్‌పై మండి పడుతున్నారు. సంజూ అంటే ఇంత కక్ష ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.
బీసీసీఐపై అక్కసు..?
బీసీసీఐలో కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత అంతర్గత వైరాలు పెరిగాయా? టీం మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐకి పడటం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానంలో కొత్తగా రోజర్ బిన్నీ ఈ పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే. అలా అధికారం చేపట్టిన వెంటనే సెలెక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు బిన్నీ ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు టీం మేనేజ్‌మెంట్‌కు నచ్చినట్లు లేదు. అందుకే బీసీసీఐకి చెప్పకుండా సొంత పెత్తనాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications