Team India : వైస్ కెప్టెన్‌గా అతని కోసం ఎదురు చూస్తున్నారు: మాజీ సెలెక్టర్

వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను సెలెక్టర్లు తొలగించారు. ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడతాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎవర్ని నియమించాలనే చర్చ జరుగుతోంది. హర్భజన్ సింగ్ వంటి వాళ్లు రవీంద్ర జడేజాకు ఈ అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మరికొందరేమో అశ్విన్, పుజారా వంటి సీనియర్లకు ఈ ఛాన్స్ ఇవ్వాలంటున్నారు.

పంత్ కోసం వెయిటింగ్..
ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలెక్టర్ సాబా కరీం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జట్టును ప్రకటించినప్పుడు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా తొలగించిన సెలెక్టర్లు.. ఎవర్నీ ఈ స్థానంలో ఎందుకు ప్రకటించలేదో కరీం వివరించాడు. టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ పునరాగమనం కోసం సెలెక్టర్లు ఎదురు చూస్తున్నారని, పంత్ తిరిగివస్తే అతనికే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని అభిప్రాయపడ్డాడు. పంత్‌ను అంతకుముందు నుంచే జట్టు భావి లీడర్‌గా సెలెక్టర్లు భావించిన సంగతి తెలిసిందే. సీనియర్లు లేనప్పుడు అతనే జట్టుకు కెప్టెన్సీ కూడా చేశాడు.

జడేజాతో అదే సమస్య..
పంత్‌ను కెప్టెన్‌గా చేయాలని సెలెక్టర్లు భావించారని, కానీ యాక్సిడెంట్ కారణంగా అతను జట్టుకు దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. అతనికి ఇలా యాక్సిడెంట్ అవడం చాలా దురదృష్టకరం అన్నాడు. పంత్ కాకపోతే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ పదవి ఇవ్వొచ్చని సాబా కరీం అభిప్రాయపడ్డాడు. అయితే అతను ఎక్కువగా గాయాలపాలవడం మళ్లీ సమస్యలు సృష్టిస్తుందన్నాడు. 'టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎవర్నీ నియమించకపోవడానికి కారణం ఉందనే అనుకుంటున్నా' అని కరీం చెప్పాడు.

ఇద్దరి మధ్యే పోటీ..
'అందరూ రిషభ్ పంత్ పునరాగమనం కోసం వెయిట్ చేస్తున్నారు. వైస్ కెప్టెన్ పోస్టుకు సరిగ్గా సరిపోయే ఆటగాడు అతనే. అతన్ని అలాగే జట్టు మేనేజ్‌మెంట్ కూడా తయారు చేసింది. అలాగే మరో రెండేళ్లలో మొదలయ్యే డబ్ల్యూటీసీ సైకిల్‌లో జట్టుకు సారధ్యం ఎవరు వహిస్తారో కూడా ఆలోచించుకోవాలి కదా. నన్నడిగితే పంత్, జడేజా ఇద్దరే ఈ పోటీలో ఉన్నారు. అయితే జడేజా ఎక్కువగా గాయాలపాలు అవుతుండటం మళ్లీ సమస్యలకు దారితీస్తుంది. కానీ పంత్ విషయంలో ఈ సమస్య లేదు. ఈ దురదృష్టకర యాక్సిడెంట్ మినహా అతను ఎప్పుడూ ఫిట్‌గానే ఉన్నాడు' అని సాబా కరీం పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications