IND vs AFG: ముగ్గురిపై వేటు.. కోహ్లి రీఎంట్రీ! అఫ్గాన్‌తో రెండో టీ20 ఆడే భారత్ తుదిజట్టు ఇదే!
India Palying XI: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఊహించినట్టుగానే స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో అఫ్గానిస్థాన్ బలహీనంగా కనిపించింది. అయితే పొట్టిఫార్మాట్‌లో అఫ్గానిస్థాన్ ఎప్పటికీ ప్రమాదకర జట్టునే. దాన్ని తక్కువగా అంచనా వేయలేం.
అయితే సిరీస్ కైవసం చేసుకోవడం కంటే జట్టు కూర్పుపైనే టీమిండియా ఎక్కువగా దృష్టిపెడుతోంది. అంతేగాక టీ20 వరల్డ్ కప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, రెండో టీ20లో భారత్ తుదిజట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. 14 నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న విరాట్ కోహ్లి కోసం ఓ బ్యాటర్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అనారోగ్యంతో తొలి టీ20కు దూరమైన యశస్వీ జైశ్వాల్ బాగానే కోలుకుంటున్నాడు. మ్యాచ్ సమయానికి పూర్తిఫిట్‌నెస్ సాధించేలా ఉన్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. దూకుడుగా ఆడుతూ గిల్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి తొలి టీ20లో ఫర్వాలేదనిపించినా.. టీమిండియా మేనేజ్మెంట్ లెఫ్ట్-రైట్ హ్యాండర్స్ బ్యాటర్లతో ఓపెనింగ్ చేయించాలని చూస్తోంది.
మరోవైపు వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కోహ్లి రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే తిలక్ వర్మ చోటు కోల్పోతాడు. తొలి టీ20లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ అంచనాలను అందుకోలేకపోయాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శివమ్ దూబె, జితేశ్ శర్మ, రింకూ సింగ్ 4,5,6 స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది. దీంతో సంజు శాంసన్‌కు మరోసారి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ కొనసాగుతాడు.
అయితే అర్షదీప్, ముకేశ్ కుమార్ ఇద్దరు పేసర్లతోనే టీమిండియా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగింది.మరో పేసర్ తీసుకోవాలనుకుంటే సుందర్‌పై వేటు పడుతుంది. సుందర్ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వస్తాడు. అయితే శివమ్ దూబె మీడియం పేస్ వేస్తుండటంతో సుందర్ జట్టులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రవిబిష్ణోయ్ స్థానంలో కుల్‌దీప్ జట్టులోకి వచ్చే అవకాశాం ఉంది. బిష్ణోయ్ మూడు ఓవర్లే వేసి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే బలహీనమైన ప్రత్యర్థియే కదా అని బిష్ణోయ్‌కు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.
కాగా, ఇండోర్ స్టేడియం రోహిత్ శర్మకు ఎంతో ఫేవరేట్. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో రోహిత్ 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. బ్యాటింగ్ అనుకూలించే ఈ మైదానంలో ఇప్పటివరకు మూడు ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు గెలిచింది. ఛేజింగ్ చేసిన జట్టు ఒక్కసారి నెగ్గింది.
భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్/శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శివమ్ దూబె, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications