తిరుమలలో అభిమాని చేష్టలకు రోహిత్ శర్మ అసహనం (వీడియో)

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం తిరుమలకు చేరుకున్న రోహిత్ శర్మ కుటుంబం ఆ రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాడు. అయితే, దర్శన అనంతరం రోహిత్ శర్మ అభిమానుల చేష్టలపై అసహనం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న రోహిత్
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం తిరుమల మాడవీధుల్లో రోహిత్ శర్మను అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీలు కావాలంటూ అడ్డు తగిలారు. ఈ సమయంలో అభిమానులకు నవ్వుతూనే సెల్ఫీలు ఇచ్చాడు.

ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన ముంబై
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నైపై అలవోక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముంబైతో ఫైనల్ ఆడుతుంది.

14 మ్యాచ్‌లాడి 390 పరుగులు చేసిన రోహిత్
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో కూడా ట్రోఫీని గెలిస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. కాగా, ఈ సీజన్‌లో రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 14 మ్యాచ్‌లాడి 390 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications