
రవి బిష్ణోయి
భారత్ తరఫున రవి బిష్ణోయి ఒకే ఒక్క వన్డే ఆడాడు. అందులో కూడా 69 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు వద్ద నిఖార్సయిన రిస్ట్ స్పిన్నర్ లేడు. చాహల్ కూడా ఫామ్‌లో లేకపోవడంతో మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులపై ఒత్తిడి ఉండటం లేదు. మిర్పూర్ మైదానం కూడా స్పిన్నర్లకు మంచి సహకారం అందించింది. అందుకే బంగ్లాదేశ్ కూడా జట్టులో అదనంగా స్పిన్నర్లను తీసుకుంది. కానీ భారత్ వద్ద మాత్రం వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సమయంలో బిష్ణోయి వంటి వికెట్ టేకింగ్ బౌలర్ కనుక జట్టులో ఉంటే కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది.

హార్దిక్ పాండ్యా
మరో ఏడాదిలో వన్డే వరల్డ్ కప్ ఉంది. దానికితోడు టీ20ల్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హార్దిక్‌కు బీసీసీఐ ఎందుకు విశ్రాంతినిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా గాయపడటం అతనికి విశ్రాంతినివ్వడం కరెక్ట్ అనే వాదనకు బలం చేకూరుస్తుంది. కానీ అతను లేని లోటు మాత్రం బంగ్లా పర్యటనలో స్పష్టంగా కనిపించింది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆధార పడదగిన బ్యాటర్ మాత్రమే కాదు.. పాండ్య తెలివైన బౌలర్ కూడా. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ ముగ్గుర్ని జట్టులోకి తీసుకున్నా ఫలితం లేకపోయింది. ముగ్గురూ కలిసినా పాండ్య లేని లోటున పూడ్చలేకపోయారు.

జస్‌ప్రీత్ బుమ్రా
భారత పేస్ గుర్రం బుమ్రా విషయంలో తొందర పడకూడదని బీసీసీఐకి కొంతకాలం క్రితమే తెలిసొచ్చింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఆసీస్‌తో అతన్ని ఆడించడం భారత జట్టుకు తిప్పలు తెచ్చింది. ఈ కారణంగా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లలో కూడా బుమ్రా ఆడలేదు. ఇప్పుడు బంగ్లా పర్యటనకు కూడా అతన్ని ఎంపిక చెయ్యలేదు. అయితే తొలి వన్డేలో భారత బౌలర్లు చివరి వికెట్ తీయలేకపోవడంతోనే అందరికి బుమ్రా లేని లోటు తెలిసొచ్చింది. ఇక రెండో వన్డేలో చివరి పది ఓవర్లలో బంగ్లా బ్యాటర్లు ధారాళంగా పరుగులు పిండుకున్నారు. మిర్పూర్ పిచ్ వేరియేషన్స్‌కు బాగా సహకరించింది. కానీ భారత బౌలర్లు మాత్రం డెత్ ఓవర్లలో దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఇది చూసిన చాలా మంది.. బుమ్రా ఉండి ఉంటే పరుగులు కట్టడి చేసేవాడని, గట్టిగా మాట్లాడితే బంగ్లా ఆలౌట్ కూడా అయ్యేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications












