హర్ష్ దీప్
పాకిస్థాన్ కు తన మొదటి ఓవర్ లోనే హర్ష్ దీప్ షాకిచ్చాడు. పాక్ కె ప్టెన్ బాబర్ అజాం ను ఎల్బీడబ్యూగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ హర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద ఉన్న ఇఫ్తికార అహ్మద్ ను మహ్మద్ షమీ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత షాదాబ్ ఖాన్ ను హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా హైదర్ అలీని కూడా 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఫామ్ లో ఉన్న మహ్మద్ నవాజ్ ను హార్ధిక్ పాండ్యా 9 పరుగులకే ఔట్ చేశాడు. అసిఫ్ అలీని హర్ష్ దీప్ వెనక్కు పంపగా.. షహీన్ షా అఫ్రిదీని భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. కాగా 19 ఓవర్ లో హర్ష్ దీప్ భారీగా పరుగులిచ్చాడు.
పాండ్యా
భారత్ బౌలర్లలో హర్ష్ దీప్ 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టగా.. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఒక ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 21 పరుగులించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
విరాట్ కోహ్లీ
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. కానీ కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.


Click it and Unblock the Notifications
