
టీమిండియా మహిళా క్రికెటర్ వనిత వి.ఆర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని 31 ఏళ్ల వనిత తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ఈ మహిళా బ్యాటర్ ప్రకటించింది. ఈ సందర్భంగా జాతీయ జట్టుతో తన ప్రయణాన్ని వివరించింది. రిటైర్మెంట్ అనంతరం రాబోయే సంవత్సరాల్లో వర్ధమాన ప్రతిభను పెంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. 19 సంవత్సరాల క్రితం తాను క్రికెట్ ఆడడం ప్రారంభించానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను క్రీడలను ఇష్టపడే ఒక చిన్న అమ్మాయినని తెలిపింది. నేటికి కూడా తనకు క్రికెట్‌పై ప్రేమ అలాగే ఉందని వనిత చెప్పుకొచ్చింది. మారుతున్న పరిస్థుతుల దృష్యా తన మనసు ఆడమని చెప్పిందని, కానీ తన శరీరం మాత్రం ఆపమని చెప్పిందని ఆమె పేర్కొంది.
కానీ తాను రెండోది అయినా తన శరీరం మాటనే వినాలని నిర్ణయించుకున్నట్లు వనిత తెలిపింది. ఇక తన బూట్లను వేలాడదీయడానికి సమయం ఆసన్నమైందని చెప్పింది. అందుకే క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె పేర్కొంది. తన కెరీర్‌లో తాను చాలా మందితో కలిసి ప్రయాణించానని తెలిపింది. 12 సంవత్సరాల తన కెరీర్‌లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ వనిత ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపింది. తన తల్లిదండ్రులు, తోబుట్లువులు తనకు సహకరించారని, తన క్రికెట్ ప్రయాణంలో ఇర్ఫాన్ సర్ మార్గనిర్దేశం చేశాడని ఆమె చెప్పింది. ప్రారంభంలో తన నైపుణ్యాలను మెరుగుపరిచాడని పేర్కొంది. ఇక నాజ్‌భాయ్ తనను చూసుకుంటూ గంటల కొద్ది సమయం నెట్స్ వద్దనే గడిపేవాడని వనిత గుర్తు చేసుకుంది.
అలాగే తన కోచ్ మురళీ, మెంటార్ వరుణ్, ట్రైనర్ రోహన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే శాంత, కల్పన మేడమ్ తనకు మంచి అవకాశాలు ఇచ్చారని పేర్కొంది. తన సోదరుడు దిలీప్ తన క్రికెట్ కెరీర్‌లో, జీవితంలో తనకు సహకరించడాని తెలిపింది. అలాగే టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్‌తో సహా పలువురు క్రీడాకారుణుల గురించి చెప్పింది. బెంగళూరులో పుట్టి పెరిగిన వనిత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమెస్టిక్ క్రికెట్‌లో బెంగాల్ జట్టు తరఫున ఆడనుంది. 2014లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో వనిత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్‌లో 6 వన్డే మ్యాచ్‌లు ఆడి 17 సగటుతో 85 పరుగులు చేసింది. ఇక 16 టీ20 మ్యాచ్‌ల్లో 14 సగటుతో 216 పరుగులు చేసింది.