Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌గా కుంబ్లేతో ఇప్పటి దాకా రెండు రోజులే: విజయ్

బెంగళూరు: అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్‌గా నియమితులైన విషయమై టీమిండియా టెస్ట్ ఓపెనర్ మురళీ విజయ్ స్పందించాడు. ఈ పన్నెండు నెలల పాటు కుంబ్లేతో టీమిండియాకు గొప్ప అనుభూతి అని చెప్పాడు. గురువారం నాడు మురళీ విజయ్ మాట్లాడాడు.

వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్ స్క్వాడ్‌లో విజయ్ ఉన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈసారి కూడా నేను బాగా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. 2011లో కరేబియన్ టూర్‌లో మురళీ విజయ్ 6 ఇన్నింగ్స్ ఆడి కేవలం 72 పరుగులు చేశాడు.

దీనిపై మాట్లాడుతూ.. గతంలో తాను బాగా ఆడలేదని చెప్పాడు. ఓవరాల్‌గా జట్టు బాగా ఆడిందని చెప్పాడు. అయితే, వ్యక్తిగతంగా తాను అప్పటి పర్యటనలో బాగా ఆడలేదని చెప్పాడు. ఈసారి బాగా ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు.

Team India will have great 12 months with Anil Kumble as coach: Murali Vijay

కుంబ్లే జూన్ 29న కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీనిపై మురళీ విజయ్ మాట్లాడుతూ.. ఇప్పటికి కోచ్‌గా కుంబ్లేతో కేవలం రెండు రోజులే ఉన్నామని చెప్పాడు. అలాగే, గతంలో రవిశాస్త్రి నేతృత్వంలో బాగా నేర్చుకున్నామని చెప్పాడు.

ఇప్పుడు కుంబ్లేను తీసుకున్నారని, తాము అతని నుంచి నేర్చుకుంటామని చెప్పాడు. భారత క్రికెట్ తరఫున అతను అద్భుతమైన ఆటగాడు అని చెప్పాడు. కుంబ్లేతో షేర్ చేసుకోవడానికి చూస్తున్నామని చెప్పాడు. వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఆ దేశం గురించి మాట్లాడుతూ.. క్రికెట్‌కు అది గ్రేట్ ప్లేస్ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+