
గిల్‌కు అవకాశాలు..!
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో కూడా రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై మాట్లాడిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా భారత జట్టు ఇదే నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించినప్పుడు.. రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతన్ని మూడో టెస్టులో ఆడించడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి.

రాహుల్‌కు నీళ్లొదిలేశారా?
'భారత జట్టు ఇక భవిష్యత్తులో రాహుల్ బదులు గిల్‌కు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పుడు ఇండోర్, అహ్మదాబాద్‌లలో టెస్టులు ఆడిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఓవల్ స్టేడియానికి వెళల్ాలి. అక్కడి వాతావరణం ఇక్కడకు చాలా భిన్నంగా ఉంటుందని మర్చిపోకూడదు' అని చోప్రా చెప్పాడు. ఇంగ్లండ్‌లో ఆడాలంటే మళ్లీ రాహుల్‌నే ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌లో రాహుల్ రికార్డు కూడా చాలా బాగుందని చెప్పాడు.

పరుగులు చేయాలి కదా?
ఇద్దరు ప్లేయర్ల రికార్డులు చూస్తే.. ఇంగ్లండ్ పరిస్థితుల్లో తనైతే గిల్ బదులు రాహుల్‌నే ఆడిస్తానని తేల్చేశాడు. 'ద్రావిడ్, రోహిత్ కూడా రాహుల్‌కు మద్దతిస్తామని చెప్పారు కదా. అదే చెయ్యాలి. కానీ ఎంత మద్దతు దొరికినా పరుగులు చేయకపోతే ఎలా? భారత్‌కు ఆడుతున్నప్పుడు కచ్చితంగా పరుగులు చేయాలి. అందుకే రాహుల్ విషయంలో టీం మేనేజ్‌మెంట్ సహనం కోల్పోయిందని నాకు అనిపిస్తోంది. ఈ కారణంగానే తర్వాతి టెస్టులో అతన్ని పక్కన పెట్టేస్తారని అనుకుంటున్నా' అని చోప్రా వివరించాడు.

ఇంగ్లండ్ పరిస్థితులు వేరు..
కానీ ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్తుంది. అక్కడి ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. అక్కడ గిల్ రాణిస్తాడా? అనేది ప్రశ్నగా మారింది. దీనిపై మాట్లాడిన చోప్రా.. 'ఇంగ్లండ్‌లో పరిస్థితులు, భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే అక్కడే భారత్ ఆడాల్సి ఉంటుంది. అక్కడి రికార్డులు చూసిన తర్వాత.. తనైతే కచ్చితంగా రోహిత్, రాహుల్ జోడీతోనే ఓపెనింగ్ చేయిస్తాను' అని స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications












