
అహ్మదాబాద్: సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా ఆ వెంటనే మరో సిరీస్‌కు సిద్ధమవుతుంది. వచ్చే నెల ఆరంభం నుంచి వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా వన్డే సిరీస్, కోల్‌కతా వేదికగా టీ20 సిరీస్ జరగనుంది. ఇందు కోసం ఇప్పటికే ఇరు జట్ల బోర్డులు తమ జట్లను కూడా ప్రకటించాయి. 18 మందితో కూడిని రెండు టీమిండియా జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. వెస్టిండీస్ సెలెక్టర్లు మాత్రం ప్రస్తుతానికి వన్డే సిరీస్‌కు మాత్రమే జట్టును ఎంపిక చేశారు. టీ20 సిరీస్‌కు తర్వాత ఎంపిక చేయనున్నారు. ఇక టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. వెస్టిండీస్‌కు కీరన్ పోలార్డ్ కెప్టెన్‌గా ఉన్నాడు.
ఫిబ్రవరి 5 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇరు జట్లు నిబంధనల ప్రకారం ముందుగానే కొన్ని రోజులు సిరీస్ జరగనున్న అహ్మదాబాద్‌లో క్వారంటైన్‌లో ఉండనున్నాయి. కాగా ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు భారత ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉంటారు. అనంతరం 4న క్వారంటైన్ నుంచి బయటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. ఇక ఫిబ్రవరి 5న అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. కాగా వ్యక్తిగత కారణాల దృష్యా టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలి వన్డే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతుంది.
భారత జట్టు:
వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హూడా, రిషబ్ పంత్, చాహర్, శార్దూల్ ఠూకూర్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్లన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసిధ్, అవేశ్‌ఖాన్.
టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్అయ్యర్, చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్, హర్షల్