బీసీసీఐ ఆడమంటే ఆడతాం: భారత్-పాక్ మ్యాచ్‌పై చాహల్


హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై యావత్ భారతవనిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో పాక్‌తో భారత మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
దీంతో అసలు భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించాలా? వద్దా అనే చర్చ జరుగుతోంది. తాజాగా భారత్-పాక్ మ్యాచ్‌పై టీమిండియా చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్పందించాడు. వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ని ఆడమంటే ఆడతామని చాహల్ వెల్లడించాడు. పాక్‌తో మ్యాచ్ మ్యాచ్ నిర్ణయం మా చేతుల్లో లేదని చాహల్ అన్నాడు.
బీసీసీఐ ఆడమంటే ఆడతాం
"బీసీసీఐ ఆడమంటే ఆడతాం. వద్దు అంటే నిలిపేస్తాం. పుల్వామా ఉగ్రదాడి చాలా బాధకరమైన ఘటన. దీనిపై చర్యలు తీసుకోకపోతే.. వారిలో మార్పు రాకపోవచ్చు. నాకు తెలుసు బీసీసీఐకి, ప్రభుత్వానికి ఇది చాలా క్లిష్టమైన సమయం. ఉగ్రదాడిపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందే. పాక్ ప్రజలు అందరూ తప్పు చేశారని అనటం లేదు.. కానీ ఈ దాడులకు పాల్పడిని వారిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందే" అని చాహల్ వెల్లడించాడు.

పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదు
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు బీసీసీఐ కూడా వెల్లడించింది. ఐసీసీ వరల్డ్‌కప్‌లో షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

టీమిండియాకే నష్టమంటోన్న మాజీలు
ఒకవేళ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ జట్టు మ్యాచ్ ఆడకూదని నిర్ణయిస్తే... పాక్‌ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయించనున్నారు. అయితే, భారత్-పాక్ మ్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం. కాగా, వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications