For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో కోహ్లీ సేనకు 'సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌' ప్రత్యేక షో

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌' మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌' మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే భారత సాయుధ దళాల కోసం భారత వైమానిక దళ ఆడిటోరియంలో ఈ సినిమా ఫస్ట్ స్క్రీనింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాని బుధవారం టీమిండియా ఆటగాళ్లు అందరూ కలిసి వీక్షించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రవి భగచ్కంద వెల్లడించారు. టీమిండియా కోసం ముంబయైలోని వెర్సోవలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు పంపించినట్లు ఆయన తెలిపారు.

Team India to watch 'Sachin: A Billions Dreams' together

ఈ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల సిద్ధమైంది. హాలివుడ్‌ దర్శకుడు జెమ్స్‌ ఎర్సకైన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్‌ టెండూల్కర్ జీవితంలో ఎవరికీ తెలియని విషయాలను చూపించారు. ఈ సినిమాకి సంగీతం ఏఆర్‌ రెహమాన్‌ అందించాడు.

ఇప్పటికే ఈ సినిమాకి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కేరళ రాష్ట్రాలు పన్ను మినహయింపు ఇచ్చాయి. గత శనివారం భారత సాయుధ బలగాల కోసం వైమానికదళ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ గౌరవ కెప్టెన్‌ సచిన్‌, ఆయన సతీమణి అంజలి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా, బలగాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడిటోరియం అంతా సచిన్‌ నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత స్టాండింగ్‌ ఒవేషన్‌ లభించింది. ఈ సినిమా వీక్షించిన తర్వాత సచిన్ టెండూల్కర్ ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ధనోవా... సచిన్‌కు ఓ జ్ఞాపిక అందజేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+