Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 సిరిస్: ఏ ఛానల్‌లో ప్రసారం, భారత్‌తో తలపడే ఐర్లాండ్ జట్టు ఇదే

India V/S Ireland Match : Telecasting Channels List
Team India vs Ireland T20 Series 2018 Schedule Dates Time TV Channels All Info

హైదరాబాద్: త్వరలో టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు బయర్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్‌ జట్టుతో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు టీ20లు జూన్ 27, 29 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లను ఏ ఛానెల్‌ ప్రసారం చేస్తుందో అనే దానిపై సగటు అభిమానిలో ఉత్కంఠ నెలకొంది.

ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరిస్‌ను సంబంధించి ప్రసార హక్కులను సోనీ సంస్ధ దక్కించుకుంది. సోనీ సిక్స్‌, సోనీ టెన్‌ 3లో ఈ రెండు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ వేదికగా ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సోనీ లైవ్‌ యాప్‌‌లో కూడా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు టీమిండియాతో తలపడే ఐర్లాండ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గ్యారీ విల్సన్‌ ఐర్లాండ్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఐర్లాండ్‌ పర్యటన ముగించుకున్న అనంతరం టీమిండియా సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. జులై 3 నుంచి ఇంగ్లాండ్‌-భారత్‌ జట్ల మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

భారత్‌తో తలపడే ఐర్లాండ్‌ జట్టు:
గ్యారీ విల్సన్‌ (కెప్టెన్‌), ఆండ్రూ బాల్‌బిర్ని, పీటర్‌ చేజ్‌, జార్జ్‌ డాక్‌రెల్‌, జాష్‌ లిటిల్‌, ఆండ్రూ మెక్‌బ్రైన్‌, కెవిన్‌ ఓబ్రియన్‌, విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌, స్టువర్ట్‌ పోయంటర్‌, బోయడ్‌ రాన్‌కిన్‌, జేమ్స్ షన్నాన్‌, సిమి సింగ్‌, పాల్‌ స్టిర్లింగ్‌, స్టువర్ట్‌ థాప్సన్‌.

Story first published: Friday, June 22, 2018, 12:38 [IST]
Other articles published on Jun 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+