వరల్డ్‌కప్: స్టడీ హ్యాండ్ ఛాలెంజ్ ఓడిన రోహిత్ శర్మ (వీడియో)

హైదరాబాద్: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధమైంది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీలో భాగంగా శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. వార్మప్ మ్యాచ్ షెడ్యూల్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం వార్మప్ మ్యాచ్ జరగనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఫొటోషూట్‌లో టీమిండియా సందడి
వరల్డ్‌కప్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత సరదాగా గడుపుతున్నారు. శుక్రవారం ఓ ఫొటోషూట్‌లో టీమిండియా సందడి చేసింది. ఆ తర్వాత టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్టడీ హ్యాండ్ ఛాలెంజ్ పాల్గొని ఓడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేసింది.
స్టడీ హ్యాండ్ ఛాలెంజ్ అంటే ఏమిటి?
ఎక్కువ తక్కువ కలిగిన ఒక ఆట వస్తువుని ఒకవైపు నుంచి మరోవైపు వరకూ చేతితో పట్టుకుని రింగుతో తాకకుండా ఆడటం. ఈ ఆట ద్వారా మన చెయ్యి స్థిరత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయితే రోహిత్ శర్మ మూడు పల్లాలను దాటి మూడో దానికి ప్రయత్నిస్తుండగా రింగు ఆ వస్తువుకు తగిలడంతో ఓడిపోయాడు.

మొత్తం 10 జట్లు
టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్ 5న సౌతంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.
వరల్డ్‌కప్‌లో భారత జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications