మ్యాచ్ రద్దయిందనే బాధ వద్దు: 3 నెలల పాటు క్రికెట్ జాతరే: టీమిండియా టైట్ షెడ్యూల్ ఇదే

ముంబై: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన బెంగళూరులో ఎడతెరిపినివ్వకుండా కురిసిన వర్షం వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 3.3 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో రెండోసారి మొదలైన వర్షం.. ఇక తెరిపినివ్వలేదు. దీనితో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

మూడు నెలలు ఫుల్ బిజీ..
పోటాపోటీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ కాస్తా ఇలా రద్దు కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. టీమిండియా ఆడే సిరీస్‌లో ఇక్కడితో ఆగిపోలేదనేది ఊరట కలిగించే అంశం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగిసిన దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆరంభం మాత్రమే. ఇక వచ్చేవన్నీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల జాతరే. మూడు నుంచి నాలుగు నెలల పాటు టీమిండియా ప్లేయర్లు అంతర్జాతీయ పర్యటనల్లో తలమునకలు కానున్నారు.

ఐర్లాండ్‌తో..
విదేశీ పర్యటనల్లో భాగంగా తొలి సిరీస్.. ఐర్లాండ్‌తో ఆరంభం కానుంది. దీని తరువాత ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకల్లో పర్యటిస్తుంది. ఇక ఆసియాకప్ 2022 ఎలాగూ ఉండనే ఉంది. ఐర్లాండ్‌తో రెండు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడనుంది భారత క్రికెట్ జట్టు. ఈ నెల 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు ఉంటాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఈ రెండూ షెడ్యూల్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభమౌతాయి.

టీమ్ ఇదే..
ఐర్లాండ్‌తో ఈ రెండు టీ20 మ్యాచ్‌ల కోసం భారత జట్టుకు ఇదివరకే జట్టును ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్యా కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కేప్టెన్. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ సెలెక్ట్ అయ్యారు.

ఇంగ్లాండ్‌లో.. ఇంగ్లాండ్‌తో
ఇంగ్లాండ్‌లో ఆ దేశ జట్టుతో ఓ టెస్ట్ మ్యాచ్ సహా మూడు చొప్పున టీ20లు, వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడాల్సి ఉంది టీమిండియాకు. ఈ సిరీస్ వచ్చేనెల 1వ తేదీన ఆరంభమౌతుంది. కోవిడ్ వల్ల వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ఇది. బర్మింగ్ హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్డ్ మ్యాచ్. గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ఇది.

వన్డే, టీ20లు ఇలా..
దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతుంది. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్, 14న లార్డ్స్‌లో ఈ రెండు మ్యాచ్‌లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.

లండన్ టు విండీస్..
ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు వెస్టిండీస్‌కు బయలుదేరి వెళ్తుంది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్, అయిదు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. జులై 22వ తేదీన తొలి వన్డే ఆరంభమౌతుంది. దీనికి క్వీన్స్ పార్క్ ఓవల్ ఆతిథ్యాన్ని ఇస్తుంది. 24, 27 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు కూడా ఇదే స్టేడియంలో షెడ్యూల్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్‌లు ఆరంభమౌతాయి.

29 నుంచి టీ20లు..
అదే నెల 29వ తేదీ నుంచి టీ20ల సిరీస్ మొదలవుతుంది. తొలి టీ20 బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియంలో ఆరంభమౌతుంది. ఆగస్టు 1, 2, 6, 7 తేదీల్లో మిగిలిన నాలుగు టీ20లు ఉంటాయి. వార్నర్ పార్క్, సెంట్రల్ బ్రొవార్డ్ అండ్ బ్రొవార్డ్ కంట్రీ స్టేడియంలల్లో వీటిని నిర్వహిస్తుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు మొదలవుతాయి. చివరి రెండు టీ20లు మాత్రం రాత్రి 9 గంటలకు ప్రారంభమౌతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications