Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెహ్వాగ్ తో గొడవల్లేవు: ధోనీ

Mahendra Singh Dhoni
లండన్‌: తనకు, వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ కు మధ్య విభేదాలు లేవని భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ లో శనివారం బంగ్లాదేశ్‌ తో మ్యాచ్‌ నేపథ్యంలో శుక్రవారం విలేకర్ల సమావేశం జరిగింది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు కెప్టెన్‌, కోచ్‌ మత్రమే వస్తారు. కానీ సెహ్వాగ్‌ సహా జట్టులో ఆటగాళ్లందరితో వచ్చి ధోని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ధోని ఒక ప్రకటనను చదివాడు. టీమ్‌ ఇండియాలో సీనియర్‌ ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశాడు. "భారత ప్రజలు, భారత క్రికెట్‌ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. జట్టు ఎప్పటిలాగే బాగుంది. ఆటగాళ్లంతా మైదానంలో, వెలుపల పరస్పరం మద్దతు తెలుపుకుంటున్నారు. నాకూ వీరేంద్ర సెహ్వాగ్‌కు మధ్య విభేదాలు పొడచూపినట్లు వచ్చిన వార్తలు తప్పు. అలా రాయడం బాధ్యతారహిత్య ప్రవర్తనే" అని ధోని అన్నాడు.

జట్టంతా ప్రపంచకప్‌ కు బాగా సిద్ధమైందని, కలసికట్టుగా ఉందని చెప్పాడు. ధోని ప్రకటన చదివాక వెంటనే జట్టంతా వెళ్లిపోయింది. గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో సెహ్వాగ్‌ గాయం గురించి ధోని మాట్లాడిన తీరు ఆ ఇద్దరి మధ్య విభేదాలున్నాయడానికి సూచికని వార్తలొచ్చాయి. గాయంతో బాధపడుతున్న సెహ్వాగ్‌ ఈ పర్యటనలో ఇంకా బ్యాటింగ్‌ చేయలేదు. అతడెప్పుడు బ్యాటింగ్‌ చేయగలుగుతాడో తాను చెప్పలేనని ధోని చెప్పాడు.

విలేకర్ల సమావేశం నుంచి ధోని తన జట్టుతో వెళ్లిపోయిన వెంటనే మీడియా ఐసీసీకి సమాచార అధికారి హసన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రపంచకప్‌ ఐసీసీ ఈవెంట్‌ అయినందు వల్ల కెప్టెన్‌ లేదా జట్టు సభ్యుడు మ్యాచ్‌ కు ముందు విలేకర్లతో మాట్లాడడం తప్పనిసరని, భారత జట్టు అలా చేయలేదని ఫిర్యాదులో పేర్కొంది. హసన్‌ మీడియా వాదనతో ఏకీభవించినప్పటికీ జట్ల ప్రవర్తనను తాము నియంత్రించలేమని చెప్పాడు. మీడియా ప్రతినిధులు నిరసన తెలపడంతో ఓ గంట తర్వాత కోచ్‌ కిర్‌స్టన్‌ విలేకర్ల సమావేశం నిర్వహించాడు. జట్టులో విభేదాలు ఏర్పడినట్లు మీడియాలో వచ్చిన వార్తలు జట్టును గాయపరిచాయని చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+