649/9 డిక్లేర్: మరోసారి తెరపైకి టెస్టుల్లో టీమిండియా టాప్ స్కోర్లు
హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో టీమిండియా నమోదు చేసినన్ని రికార్డులు మరే ఇతర జట్టు నమోదు చేయక పోవడం విశేషం. 1932లో టెస్టు అర్హత పొందిన భారత జట్టు అప్పటి నుండి సాంప్రదాయ ఫార్మాట్‌లో అనేక రికార్డులను సృష్టిస్తూనే వస్తోంది.
ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.... గత ఐదు దశాబ్దాలుగా అంతర్జాతీయ టెస్టుల్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే టీమిండియా భారీ స్కోరు సాధించిన ఏ టెస్టులోనూ ఓడిపోలేదు. తాజాగా, రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసింది.

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా 649/9 వద్ద డిక్లేర్
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు పృథ్వీషా (134), కెప్టెన్ కోహ్లీ (139), రవీంద్ర జడేజా (100) సెంచరీలు చేయగా, రిషబ్ పంత్ (92), చతేశ్వర్ పుజారా (86)లు సెంచరీ మిస్సయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.

గత 86 ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడుతోన్న టీమిండియా
ఈ నేపథ్యంలో భారత్ టాప్ స్కోరు ప్రస్తావన తెరపైకి వచ్చింది. గత 86 ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడుతోన్న టీమిండియా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత జట్టు రికార్డ్ స్థాయిలో నాలుగు సార్లు 700 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేసింది. 2009లో తొలి సారిగా 700 పరుగుల మార్క్ దాటింది.

2016లోనే టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్
2016లోనే టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. టీమిండియా టెస్టుల్లో 700 పరుగుల మైలురాయిని నాలుగు సార్లు దాటగా, అందులో రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. 2016లో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుపై సాధించిన 759 పరుగులే భారత జట్టు టెస్ట్‌ల్లో అత్యధిక స్కోరు.

చెపాక్ స్టేడియం టీమిండియా అత్యధిక స్కోరు
* డిసెంబర్ 16, 2016న ఇంగ్లండ్‌పై చెన్నైలో 759-7డిక్లేర్డ్ (190.4 ఓవర్లు)- మ్యాచ్ ఫలితం గెలుపు
* డిసెంబర్ 2, 2009న శ్రీలంకపై ముంబైలో 726-9డిక్లేర్డ్ (163.3 ఓవర్లు) మ్యాచ్ ఫలితం గెలుపు
* జూలై 26, 2010న శ్రీలంకపై కొలంబోలో 707 (225.2 ఓవర్లు)- మ్యాచ్ ఫలితం డ్రా
* జనవరి 2, 2004న ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్ట్‌లో 705-7డిక్లేర్డ్ (187.3 ఓవర్లు) - మ్యాచ్ ఫలితం డ్రా
* ఫిబ్రవరి 9, 2017న బంగ్లాదేశ్‌పై హైదరాబాద్ టెస్ట్‌లో 687-6డిక్లేర్డ్ (166.0 ఓవర్లు)- మ్యాచ్ ఫలితం గెలుపు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications