Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India : ఐపీఎల్ ముగిసిన తర్వాత.. కొత్త అవతారంలో టీమిండియా..!

టీమిండియా జెర్సీ స్పాన్సర్ మారిపోతోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం టీమిండియా జెర్సీ కోసం కొత్త డీల్ చేసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా టీమిండియా కొత్త జెర్సీతోనే బరిలో దిగుతుందని వెల్లడించింది.

టీమిండియా కొత్త టూల్‌ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ ఆదిదాస్‌ కంపెనీతో కొత్తగా డీల్ చేసుకున్న విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించాడు. దీన్ని ధ్రువీకరిస్తూ జై షా ట్వీట్ చేశాడు. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఇది లాంగ్ టర్మ్ డీల్ అని తెలుస్తోంది.

Adidas Toolkit Sponsor Team India

'ఆదిదాస్‌తో కిట్ స్పాన్సర్‌గా బీసీసీఐ కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నా. మేం క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రపంచంలోని నెంబర్ వన్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్‌ అయిన ఆదిదాస్‌తో భాగస్వామ్యం చేసుకున్నందుకు చాలా ఎగ్జయిట్ అవుతున్నాం. వెల్‌కం అబోర్డ్, ఆదిదాస్' అని జై షా ట్వీట్ చేశాడు.

ఇప్పటి వరకు టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా బైజూస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఈ స్పాన్సర్ మారిపోతోంది. గతంలో కొంత కాలం పాటు నైకీ కూడా టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉన్న టీమిండియా జెర్సీ కూడా చాలా బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడటం తెలిసిందే.

మరి ఇప్పుడు ఆదిదాస్ కూడా ఆ రేంజ్‌లో కొత్త జెర్సీని అందిస్తుందేమో చూడాలి అని ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ అంటున్నారు. అదే జరిగితే టీమిండియాను మరింత అందమైన డ్రెస్‌లో చూపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరి ఆదిదాస్ టీమిండియాను ఎలా చూపిస్తుందో చూడాలి మరి.

Story first published: Monday, May 22, 2023, 15:26 [IST]
Other articles published on May 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+