తొలి బంతికే డీఆర్ఎస్..అవసరమా? వ‌్యతిరేక ఫలితం

మాంచెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తొలి సెమీ ఫైనల్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆరంభమైంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పట్లాగే- ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ స్ట్రైకింగ్ తీసుకున్నారు. మిడిల్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని గుడ్ లెంగ్త్ డెలివరీగా తొలిబంతిని సంధించాడు భువనేశ్వర్ కుమార్.
ఆ బంతిని ఆడటానికి ముందుకొచ్చిన గప్టిల్.. రిథమ్ తప్పాడు. బంతి గప్టిల్ ప్యాడ్లను బలంగా తాకింది.అంతే! వెంటనే బౌలర్ భువనేశ్వర్ కుమార్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, పాయింట్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న కేప్టెన్ విరాట్ కోహ్లీ..ఎల్‌బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీనితో అసహనానికి గురైనట్టు కనిపించాడు కోహ్లీ. డీఆర్ఎస్ తీసుకున్నాడు గానీ.. ఉపయోగం లేకుండా పోయింది.
మిడిల్ స్టంప్ దిశగా పిచ్ పడ్డ బంతి అవుట్ స్వింగ్ తీసుకుంది. వికెట్ల మీదుగా వెళ్తున్నట్లు నిర్ధారించారు. దీనితో థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. ఫలితం- ఉన్న ఒక్క డీఆర్ఎస్ అవకాశం వృధా అయింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఇలా తొలిబంతికే డీఆర్ఎస్‌ను వృధా చేసుకున్న జట్టు మరొకటి లేదనే అనుకోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications