
వెస్టిండీస్ టూర్‌తో ఆరంభం:
గత సంవత్సరం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా టీమిండియా బిజీ షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలిస్తుండటంతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రికిన్‌ఫో తెలిపింది. వాయిదా వేసిన కార్యక్రమాలు రాబోయే రెండేండ్లలో జరుగుతాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి భారత జట్టుకు బిజీ షెడ్యూల్ ఉన్నది. వెస్టిండీస్ జనవరిలో భారతదేశంలో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

శ్రీలంక, ఇంగ్లండ్ పర్యటనలు:
వెస్టిండీస్ టూర్ తర్వాత శ్రీలంక బృందం ఫిబ్రవరి, మార్చిలో భారత పర్యటనకు రానున్నది. శ్రీలంకతో 3 టెస్ట్ మ్యాచ్‌లు, 3 వన్డేల సిరీస్ ఆడనున్నది. అదే సమయంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత జట్టు జూన్, జూలైలో ఇంగ్లండ్ వెళ్తుంది. ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లను కోహ్లీసేన ఆడనుంది. అక్కడి నుంచి భారత్ వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. జూలై-ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

తీరికలేని క్రికెట్:
ఆసియా కప్ సెప్టెంబర్‌లో జరగనున్నది. భారత జట్టు సెప్టెంబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశీ సిరీస్ ఆడనున్నది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడనున్నాయి. నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఉంది. మొత్తానికి భారత జట్టు వచ్చే ఏడాది తీరికలేని క్రికెట్ ఆడనుంది. అప్పటివరకు కరోనా అదుపులోకి వస్తే.. ఈ పర్యటనలు అన్ని సజావుగా సాగుతాయి. లేదంటే అంతేసంగతులు.

బిజీగానే 2021:
2021లో భారత్ షెడ్యూల్ బిజీగానే ఉంది. జనవరిలో ఆస్ట్రేలియా పర్యటన, ఆవెంటనే స్వదేశంలో ఇంగ్లండ్ టూర్‌తో మూడు నెలల పాటు అన్ని ఫార్మాట్లు ఆడారు. ఇక ఏప్రిల్ ఆరంభంలో ఐపీఎల్ 2021తో మరింత బిజీ అయ్యారు. అయితే కరోనా కారణంగా సగం టోర్నీ వాయిదా పడడంతో.. ఇప్పుడు కాస్త సేదతీరుతున్నారు. అయితే ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్ పర్యటనతో మళ్లీ ఆటతో బిజీ కానున్నారు. ఆపై కుదిరితే ఐపీఎల్ 2021 జరగనుంది. ఇక సెప్టెంబర్-నవంబర్ మాసాల్లో టీ20 ప్రపంచకప్ టోర్నీ ఉంది. మెగా టోర్నీ ఆతిధ్య హక్కులు మానవద్దే ఉన్నాయి. మొత్తానికి క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పాలి.


Click it and Unblock the Notifications












