ఆసియా కప్: ఆదివారం బంగ్లాదేశ్‌కు టీమిండియా
బెంగుళూరు: బంగ్లాదేశ్‌లో జరగనున్న ఆసియా కప్ టోర్నమెంట్ కోసం మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం బయల్దేరనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది.
ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత తొలిసారి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి 20 ఓవర్ల ఫార్మాట్‌కు మార్చారు. టోర్నీలో టీమిండియా తన తొలి గేమ్‌ను ఫిబ్రవరి 24న ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కాగా దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఫిబ్రవరి 27న మ్యాచ్ జరగనుంది.

ఆసియా కప్ టోర్నమెంట్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు బంగ్లాదేశ్‌లోని షేర్ ఈ బంగ్లా స్టేడియంలో జరగనుంది. కాగా క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి జరగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక ఢిపెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతుంది. ఆసియా కప్ తర్వాత భారత్‌లో ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్ జరగనుంది.
ఆసియా కప్‌కు భారత జట్టు:
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, జస్పీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, సురేష్ రైనా, అజింక్య రహానే, హర్భజన్ సింగ్, మహమ్మద్ షామీ, పవన్ నెగి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications