టీమిండియా బ్లూ జెర్సీపై మారనున్న బ్రాండ్.. ఒప్పో స్థానంలో బైజుస్

ముంబై: టీమిండియా ఆటగాళ్లు ధరించే బ్లూ జెర్సీపై మొబైల్ సంస్థ ఒప్పో బ్రాండ్ త్వరలో కనుమరుగవనుంది. ఒప్పో బ్రాండ్‌కు బదులు త్వరలో కొత్త బ్రాండ్ స్వదేశీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ కనిపించనుంది. 2017 మార్చిలో టీమిండియా జెర్సీపై బ్రాండ్ హక్కులను ఒప్పో సంస్థ రూ. 1,079 కోట్లకు దక్కించుకుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ముందుగానే తప్పుకుంటోన్న ఒప్పో:
ఐదేళ్ల పాటు టీమిండియా జెర్సీపై ఒప్పో బ్రాండ్ కనిపించేలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇంకా రెండేళ్ల ఒప్పందం ఉన్నప్పటికీ ఒప్పో ముందుగానే తప్పుకుంటోంది. 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామనే కారణంతో ఒప్పో తప్పుకోవాలని చూస్తోందట. అంత మొత్తంలో చెల్లించలేమనే వైదొలుగుతుందట.

దక్షిణాఫ్రికా టూర్ నుండి బైజూస్:
బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ ఈ హక్కులను ఒప్పో నుంచి అంతే ధరకు సొంతం చేసుకుంది. ఈ సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు బైజుస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ వెస్టీండీస్ టూర్ వరకూ మాత్రమే ఒప్పో బ్రాండ్ టీమిండియా జెర్సీపై కనిపించనుంది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టూర్ సమయానికి టీమిండియా జెర్సీపై బైజూస్ బ్రాండ్ దర్శమిస్తుంది.

బ్రాండ్ అంబాసిడర్స్‌గా అగ్ర హీరోలు:
ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన బైజూస్ కంపెనీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగంలో దూసుకుపోతోంది. తెలుగులో మహేష్ బాబు, బాలీవుడ్‌లో షారూక్ ఖాన్ వంటి అగ్ర నటులను బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు. వీరి ఇద్దరి ప్రచారంతో బైజూస్ ఓ రేంజ్‌కు చేరుకుంది. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 2న పూర్తవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications