కోహ్లీని ఫాలో అవుతున్నాడు: కష్టపడుతున్న రహానే
హైదరాబాద్: ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే కసరత్తులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు, వన్డే సిరిస్‌లలో రహానే పేలవమైన ప్రదర్శన కనబర్చాడు.

దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరిసిలో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నేఫథ్యంలో రహానే ఫిట్ నెస్‌పై దృష్టిసారించాడు. బంగ్లాదేశ్ టెస్టుకు ముందు తనకు లభించిన సమయాన్ని జిమ్‌లో కసరత్తులు కోసం ఉపయోగించుకుంటున్నాడు. జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
ఇదిలా ఉంటే క్రికెట్ నుంచి విశ్రాంతి లభించినప్పుడల్లా టీమిండియా కెప్టెన్ కోహ్లీ జిమ్‌లోనే ఎక్కువ సమయాన్ని గడపడాన్ని మనం చూశాం. ఈ క్రమంలో రహానే కూడా కోహ్లీ మాదిరి జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుండటం విశేషం. భారత్, బంగ్లాల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications