For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టెస్టు చివరి రోజు: భారత్ గెలవాలని ఓ సౌతాఫ్రికన్ ప్రార్ధన, అసలేం జరిగింది?

By Nageshwara Rao
 Team India Takes Care of ‘Ignored’ South African Team Driver Andre

హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో భారత్ 135 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే సెంచూరియన్ టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు ఓ దక్షిణాఫ్రికా జాతీయుడు టీమిండియా గెలవాలని ప్రార్ధన చేశాడు.

అంతేకాదు ఈ టెస్టులో దక్షిణాఫ్రికా ఓడిపోవాలని తాను కోరుకున్నట్లు తెలిపాడు. తాను సౌతాఫ్రికాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ కోహ్లీసేన మంచితనాన్ని చూసి తాను ఈ ప్రార్ధన చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవరతను? అని అనుకుంటున్నారా? దక్షిణాఫ్రికా జట్టు బస్ డ్రైవర్ ఆండ్రీ క్రోగ్.

కేప్‌టౌన్‌లో, సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టను హోటల్‌కు, స్టేడియానికి తీసుకెళ్లింది ఇతనే. అయినా సరే టీమిండియా గెలవాలని కోరుకున్నాడు. ఎందుకూ అని ప్రశ్నించగా ఆశ్చర్యపోయే విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురిపంచాడు.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా తనతో ఎంతో హుందాగా వ్యవహరిస్తారని, అయితే వాళ్ల జట్టులోని ఓ అధికారి మాత్రం తనను డ్రైవర్‌గా కాదు కదా.. కనీసం మనిషిగా కూడా చూడడని చెప్పుకొచ్చాడు. తన బాగోగులు గురించి అస్సలు పట్టించుకోడని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడని ఆండ్రీ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

మరోవైపు తన స్నేహితుడు, టీమిండియా జట్టు బస్ డ్రైవర్ రోనీ మూడ్లేని కోహ్లీ సేన ఎంత బాగా చూసుకుంటుందో చూసి ఆండ్రీ ఆశ్చర్యపోయాడు. 'భారత జట్టు సభ్యులు చాలా మంచోళ్లు. వాళ్లు డ్రైవర్ (రోనీ మూడ్లీ)ను ఎంతో గౌరవంగా చూస్తారు. తమ జట్టులో ఒకడిగా భావిస్తారు. రోనీ, నేను టీమ్స్ కోసం బయట వేచి చూస్తుంటే.. భారత జట్టు సభ్యులే మాకు కావాల్సిన నీళ్లు, కూల్ డ్రింక్స్ ఇచ్చారు' అని అన్నాడు.

'డ్రైవర్ కనీస అవసరాలేంటో తెలుసుకొని ఇవ్వడం ఎంత గొప్ప విషయం. భారత ఆటగాళ్లు ఎంత మంచివారంటే... తమ డ్రైవర్ ఫ్రెండ్స్ కోసం టికెట్లు అడిగితే ఇచ్చారు. నేను అడిగితే.. నాకు కూడా వాళ్లే టికెట్లు ఏర్పాటు ఇచ్చారు' అని ఆండ్రీ తెలిపాడు.

క్రికెట్ దక్షిణాఫ్రికాను టికెట్లు అడగొచ్చుగా అని అడిగితే 'నాకు లంచ్ కూపన్లు ఇవ్వాల్సిన వ్యక్తి ఆ విషయాన్నే మరచి పోతాడు. అలాంటి వారిని టికెట్లు ఏమడుగుతాం. భారత జట్టులో నాకు సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు' అని ఆండ్రీ చెప్పాడు. అందుకే తాను కనీసం సఫారీ జట్టు జెర్సీ వేసుకోవడానికి కూడా నిరాకరించానని చెప్పాడు. తన కంపెనీ షర్ట్ వేసుకొనే సఫారీ జట్టుతో తిరుగుతున్నానని చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 16:12 [IST]
Other articles published on Jan 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+