న్యూజిలాండ్‌తో నేటి నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రిషబ్ పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు.
ప్రాక్టీస్ సెషన్‌లో అనుకోని ప్రమాదం
వడోదరలోని బీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో థ్రోడౌన్ స్పెషలిస్ట్ వేసిన బంతి పంత్ పక్కటెముకలపై బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన రిషబ్ పంత్‌ను వెంటనే వైద్య పరీక్షల కోసం తరలించారు. రిషబ్ పంత్‌కు కుడి వైపు పొత్తికడుపు భాగంలో 'సైడ్ స్ట్రెయిన్'అయినట్లు నిర్ధారణ అయింది. దీనివల్ల అతడు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి అతడిని తప్పించామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

అదృష్టాన్ని అందుకున్న ధ్రువ్ జురేల్
రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో సెలెక్టర్లు వెను వెంటనే ధ్రువ్ జురేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (2025-26) లో జురేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న జురేల్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 558 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో దాదాపు 74 పరుగుల సగటు కలిగిన ఈ 24 ఏళ్ల వికెట్ కీపర్, ఇప్పటివరకు వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేయలేదు.
నేడే తొలి వన్డే.. కీపర్‌గా ఎవరు?
వడోదర వేదికగా నేడు మొదటి వన్డే జరగనుంది. పంత్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా బరిలోకి దించే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉంది.